పెళ్లి తర్వాత రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిన నయనతార..!

Pulgam Srinivas
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తమిళ సినిమాలు అయిన గజిని , చంద్రముఖి మూవీ ల ద్వారా తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న నయనతార ఆ తర్వాత అనేక తెలుగు సినిమా లలో కూడా హీరోయిన్ గా నటించింది . అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో  అనేక విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడంతో నయనతార టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక సంవత్సరాలు పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది .

నయనతార ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది . ఇది ఇలా ఉంటే నయనతార ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఈ ముద్దుగుమ్మ కమర్షియల్ సినిమాల్లో నటించడం కంటే కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.

అందులో భాగంగా నయనతార ఇప్పటికే అనేక లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి తమిళ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే నయనతార కు కొన్ని రోజుల క్రితమే విగ్నేష్ తో వివాహం జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కూడా నయనతార కు ఆఫర్ ల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. నయనతార  పెళ్లి తర్వాత తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది. నయనతార ప్రస్తుతం మూవీకి 10 కోట్ల వరకు రెమ్యునిరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: