నితిన్ చాలా నిజాయితీ గల వ్యక్తి... కృతి శెట్టి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తాజాగా నితిన్ హీరోగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.

నితిన్ ఈ మూవీ లో కలెక్టర్ పాత్రలో కనిపించ బోతున్నాడు. మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా , సముద్ర ఖని ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కృతి శెట్టి , నితిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కృతి శెట్టి మాట్లాడుతూ ... నితిన్ చాలా నిజాయితీగల వ్యక్తి , అందులో కూడా ఒక అందమైన అమాయకత్వం ఉంటుంది అని నితిన్ గురించి వ్యాఖ్యలు చేసింది. కృతి శెట్టి 'మాచర్ల నియోజకవర్గం' మూవీ గురించి మాట్లాడుతూ ...  ఈ మూవీ లో నా పాత్ర పేరు స్వాతి అని ,  ఈ కథను విన్న వెంటనే ఈ మూవీ కి ఓకే చెప్పాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా కృతి శెట్టి తెలియజేసింది. ఈ మూవీ లో మరో హీరోయిన్ గా క్యాథరీన్ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: