నాగ చైతన్య మూవీ లో రష్మిక మందన..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య కొన్ని రోజుల క్రితం విడుదలైన థాంక్యూ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది.

దానితో ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య , విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ దశలో ఉంది. ఈ వెబ్ సిరీస్ తో నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే నాగ చైతన్య , అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు.

ఈ మూవీ ఆగస్ట్ 11 వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించబోతోంది. వీటితో పాటు నాగ చైతన్య , పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య , పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా రష్మీక మందన ను తీసుకోవాలనే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: