దూత పై భయపడుతున్న నాగచైతన్య.. కారణం..?

Divya

నాగచైతన్య నటించిన తాజా చిత్రం థాంక్యూ ఇటీవల ఈ సినిమా విడుదల ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు కూడా కలెక్షన్లను అంతంత మాత్రమే అందుకుంది. నాగచైతన్య కెరియర్లో అత్యంత డిజాస్టర్ మూవీగా యుద్ధశరణం చిత్రం కంటే అతి తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ సినిమా మొదటినుంచి పెద్దగా హైట్ లేకపోవడం వల్లే ఇలా ఓపెనింగ్స్ రాలేదని అభిమానుల సైతం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వరుసగా విభిన్నమైన సినిమాలతో డైరెక్టర్ విక్రమ్ కి ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చారు.

అయితే ఈసారి థాంక్యూ సినిమాతో ఇలాంటివి అసలు ఊహించలేదని మరికొంతమంది నేటిజన్లు తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో నాగచైతన్య నటిస్తున్న తన తదుపరి ప్రాజెక్టు పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నది. అది కూడా థాంక్యూ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. థాంక్యూ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ విక్రమ్ ఒక హర్రర్ కాన్సెప్ట్ తో దూత అనే వెబ్ సిరీస్ ని నాగచైతన్యతో  నిర్మించాలని అనుకున్నారు కాన్సెప్ట్ బాగా నచ్చడంతో థాంక్యు సినిమా విడుదలైన తర్వాత ఆ ప్రాజెక్టును అమెజాన్ ప్రైమ్ తో కలిసి మొదలు పెట్టాలనుకున్నారు.
ఇక థాంక్యూ సినిమా తీవ్రంగా నష్టాలను రాబట్టడంతో దర్శకుడు కొంత అప్సెట్ అయినట్లుగా తెలుస్తోంది.. దీని ప్రభావం  దూత అనే వెబ్ సిరీస్ పైన పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఎందుచేత అంటే నాగచైతన్య వెబ్ సిరీస్ నటించేది ఇదే మొదటిసారి.. పైగా 45 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ  వెబ్ సిరీస్ ను పెరకెక్కించడం జరుగుతోంది. పూర్తిగా ఎన్నో డిఫరెంట్ వెబ్ సిరీస్ లో ఎంతోమంది హీరోలు రాబోతున్నారు. కాబట్టి ఇలాంటి పోటీలు నాగచైతన్య సక్సెస్ అవుతాడా కాదా అని భయం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: