నమితకు సీనియర్ హీరోతో ఎఫైర్.. ఆమె భర్త ఏమన్నాడో తెలుసా?

praveen
హీరోయిన్ నమిత.. ఈ పేరు చెబితే చాలు కుర్రకారుపగటి కలల్లోకి వెళ్ళి పోతూ ఉంటారు. ఎందుకంటే ఈ అమ్మడి అందాలతో అంతలా కుర్రకారుకు పిచ్చెక్కించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 2002లో ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన సమయంలో అందానికి ఈ అమ్మడు చిరునామా నేమో అని అనిపించేలా ఉండేది. ఇక ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది ఈ అమ్మడి అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను ఆకర్షించింది.

 ఇక ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ఒక రాజు ఒక రాణి అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే ఒక్కసారిగా ముద్దుగా బొద్దుగా మారి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే లావు గా మారిన తరువాత కూడా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గలేదు కదా మరింత ఎక్కువయ్యాయి. తెలుగు తో  పాటు తమిళంలో కూడా గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో ఇక సీనియర్ హీరో బాలకృష్ణకు జోడీగా సింహా లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. 2017లో వ్యాపారవేత్త నిర్మాత వీరేంద్ర చౌదరి వివాహం చేసుకుని సెటిల్ అయిన విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇలాంటి సమయంలో నమిత  గురించి వచ్చిన ఒక వార్త మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఒక సీనియర్ హీరోతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. పెళ్లికి ముందు ఇలాంటి రూమర్లు వచ్చాయి. ఇక వీరేంద్ర తో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నటుడు శరత్ బాబు నమిత ఎఫైర్ ఉందని వార్తలు హల్ చల్ చేశాయి. ఈ వార్తలు అటు నమిత ఫ్యామిలీ లైఫ్ ని ఎంతగానో డిస్ట్రబ్ చేసాయి అని చెప్పాలి. అయితే నా లైఫ్లో విన్న చెత్త రూమర్లలో ఇది మొదటి స్థానంలో ఉంటుందని.. శరత్ బాబు చాలా పెద్దాయన..  గౌరవంగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి కి నమితకు ఎఫైర్ ఉంది అని రాయడం సరికాదు అంటూ వీరేంద్ర ఈ వార్తలపై స్పందించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: