పాన్ ఇండియా చిత్రంగా విశాఖపట్నం కేంద్రం..!!

Divya
ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల పేరు బాగా వినిపిస్తూ ఉన్నది. మధ్యకాలంలో స్టార్ హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలలోనే నటిస్తూ ఉన్నారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ కీర్తి ప్రతిరోజ తారస్థాయికి చేరుతుందని చెప్పవచ్చు. దీంతో మరికొన్ని సినిమాలు కూడా బడా హీరోలవి సైతం ఫ్లాప్ గా మిగిలిపోతూ ఉన్నాయి. కానీ పాన్ ఇండియా సినిమా అంటే చాలు .. చెప్పినంత సులువుగా ఈ సినిమా అయిపోదు దాని వెనుక ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి.

ఇక ఈ సినిమాకి ముఖ్యంగా కోట్లల్లో పెట్టుబడి పెట్టే నిర్మాతలు ఉండాలి ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్ గ్లామర్ సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఉండాలి. ఇక ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టుల సైతం ప్రతి ఒక్కరు తెలిసినవారే కావలసి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక సాంగ్ చాలా ట్రెండిగా మారుతోంది. "నిన్నేయ్  చుస్తేయ్ నన్నిలా మనసు" ఆనే  పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సినిమాలోనిది.. ఈ సినిమాలోని పాటని స్టార్ సింగర్ అంజన సౌమ్య శివ వాసకర్ల ఈ పాటను పాడడం జరిగింది. అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా ఏంటి అని అనుకుంటున్నారు నేటిజన్స్.

ఈ సినిమాని మిధున ఎంటర్టైన్మెంట్ సమర్పణలు ఒకేసారి నాలుగు భాషలలో విడుదల చేస్తున్నారు నిర్మాత ఎం ఎం అర్జున్. ఈ సినిమాకి డైరెక్టర్ సతీష్ బత్తుల కొత్త డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. ఇక హీరోగా శివకుమార్ గ్లామరస్ హీరోయిన్గా అక్షిత శ్రీధర్ అర్చన నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఒక సైంటిఫిక్ సస్పెన్స్, రొమాంటిక్ ,త్రిల్లర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్స్ అయిన ధనరాజ్, సత్య ,దుర్గాప్రసాద్, మాధవి వంటి వారు ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ పలు భాషలలో విడుదలై బాగా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: