కొరటాల ముఖ్యమంత్రిని చేస్తే.. త్రివిక్రమ్ మంత్రిని చేస్తున్నాడట..!

shami
సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట తర్వాత చేస్తున్న సినిమా త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కుతుందని తెలిసిందే. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఆగష్టులో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమా లో మహేష్ పాత్ర గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ సినిమా కథ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో మహేష్ మినిస్టర్ గా నటిస్తున్నారని టాక్.
ఆల్రెడీ కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా నటించారు. ఆ సినిమాలో యంగ్ అండ్ స్మార్ట్ సీఎం గా ప్రజలకు జవాబుదారిగా ఉండే ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంటుందో చూపించారు. ఇక ఇప్పుడు త్రివిక్రం సినిమా కోసం మహేష్ ఐటీ మినిస్టర్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. త్రివిక్రం మార్క్ పొలిటికల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రం చేస్తున్న ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు.
మహేష్ త్రివిక్రం కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు థర్డ్ మ్యూజిక్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో భారీ మూవీ రాబోతుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేలా సినిమా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా లో మహేష్, పూజా హెగ్దేల రొమాన్స్ కూడా సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా అల వైకుంఠపురములో ని మించి ఈ సినిమాలో సాంగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఆగష్టులో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాని 2023 సమ్మర్ రిలీజ్ ఫిక్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: