ఇందిరా గాంధీ లుక్ లో అదరగోడుతున్న కంగనా..!!

murali krishna
కొంతకాలంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బయోపిక్స్‌ అనేవి పక్కా సక్సెస్ ఫార్ములాగా మారిపోయాయి. క్యారెక్టర్, కాన్ ఫ్లిక్ట్, కట్టిపడేసే కథ ఉంటే చాలు..


హిస్టారికల్, పీరియాడికల్, కాంట్రవర్షియల్ అన్న తేడాలు లేకుండా బయోపిక్స్‌ కి ఓకే చెప్తున్నారట మేకర్స్ అండ్ స్టార్స్‌.


కానీ హిట్, ఫ్లాప్ అంటూ కలెక్షన్ల లెక్కలు వేసుకోకుండా బయోపిక్స్‌ పై తెగ ఇంట్రస్ట్ చూయిస్తోందట బీటౌన్ క్వీన్ కంగనా. ఓవైపు కాంట్రవర్సీ కామెంట్స్ తో న్యూస్ లో స్పేస్ ఆక్యుపై చేస్తూనే మరోవైపు క్యారెక్టర్స్‌ సెలక్షన్స్ తోనూ హెడ్ లైన్స్‌ లో కూడా నిలుస్తోంది. లేటెస్ట్ గా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో తాను నటిస్తున్న ఎమర్జెన్సీ మూవీ ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. తన లుక్స్ చూశాక వాట్ ఏ మేకోవర్ అంటూ కాంప్లిమెంట్లు కురిపిస్తున్నారట ఆడియెన్స్‌. అయితే ఇప్పటికే పొలిటికల్ వివాదాలతోనూ విమర్శలు ఫేస్ చేస్తున్న కంగనా, ఎమర్జెన్సీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ కొత్తమూవీతో రాజకీయాల్లో ఇంకెంత దుమారం రేపుతుందో అనేదే ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారిందట.


గతంలోనూ బయోపిక్స్, హిస్టారికల్ క్యారెక్టర్స్‌ తో వెండితెరపై సందడి చేసింది కంగనా. ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రతో తెరకెక్కిన మణికర్ణిక మూవీలో టైటిల్ రోల్ పోషించి,క్రిష్ తో పాటు ఈ ప్రాజెక్టుకి కో డైరెక్టర్ గా కూడా ఆమె వ్యవహరించింది. ఈ చిత్రంతో తన నటనకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఆ సినిమా రిలీజ్ టైమ్ లోనూ డైరెక్టర్ క్రిష్ తో అభిప్రాయ బేధాలంటూ దర్శకత్వం విషయంలో కూడా వివాదాల్లో నిలిచింది.


ఆ తర్వాత తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన ‘తలైవి’ మూవీలోనూ నటించింది. పురుచ్చితలైవిగా ఆమె రాజకీయ ప్రస్థానం, జీవితం, మరణం.. ఇలాంటి టాపిక్స్ అన్నిటినీ ఈ మూవీలో ఎలా చూయిస్తారా? జయలలితగా బాలీవుడ్ భామ కంగనా ఎంతలా మెప్పిస్తోంది అంటూ ఆడియెన్స్ కూడా తెగ ఎదురుచూశారు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత సక్సెస్ సాధించనప్పటికీ తన నటనకు మంచి మార్కులే పడ్డాయట.


కాంట్రవర్సీస్, కామెంట్స్ పక్కనపెడితే క్యారెక్టర్ నచ్చితే కంగనా ఎంతలా కష్టపడుతుందో, రైటింగ్, మేకింగ్ అండ్ టేకింగ్ లో ఎంత ఇన్వాల్వ్ అయ్యి తన మార్క్ చూయించాలనుకుంటుందో తెలిసిందే. సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ లోనూ బడా హీరోయన్ గా తన క్రేజ్‌ ను కంటిన్యూ చేస్తూనే వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, ఫ్యాషన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, క్రిష్ త్రీ, క్వీన్.. ఇలా ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు పీరియాడికల్ అండ్ బయోపిక్ క్యారెక్టర్స్ లోనూ నటిస్తూ యాక్ట్రెస్ గా తన వర్సటాలిటీని పర్ ఫెక్ట్ గా మానేజ్ చేస్తోంది. ఆ పాత్రల కోసం సరికొత్త మేకోవర్స్ నూ ట్రై చేస్తూ, ఆ క్యారెక్టర్ల అభిమానులను ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడానికే చూస్తోందట.


గతంలోనూ ఇందిరాగాంధీ పాత్రలో చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్లు నటించారు. బెల్ బాటమ్ లో లారాదత్తా, థాక్రే మూవీలో అవంతికా ఆక్రేకర్, పీఎం నరేంద్రమోడీ బయోపిక్ లో కిషోరీ సహానే..ఇలా చాలా మంది యాక్ట్రెస్ లు ఆమె క్యారెక్టర్లో కనిపించారట.అయితే ఆ సినిమాల్లో వాళ్ల పాత్రల నిడివి చాలా తక్కువే. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ రోల్ ఉన్న మూవీ కావడం, రాజకీయాల్లో రచ్చకు, రకరకాల చర్చలకు సెంటర్ పాయింట్ గా మారుతున్న కంగనా ఈ క్యారెక్టర్లో నటిస్తుండడంతో ఎమర్జెన్సీ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. మరి ఫస్ట్ లుక్ రిలీజ్ తోనే సోషల్మీడియాలో హవా చూయిస్తున్న ఈ ప్రాజెక్ట్ రేపు థియేటర్లో రిలీజయ్యాక ఇంకెంతలా వార్తల్లో ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: