ఎన్టీఆర్ మూవీ తర్వాత ఆ హీరోను టార్గెట్ చేసిన కొరటాల..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మిర్చి సినిమా నుండి మొదలు పెడితే తాజాగా విడుదల అయిన ఆచార్య సినిమా వరకు కమర్షియల్ హంగులతో మూవీ లను తెరకెక్కించినప్పటికీ సినిమాలో ఏదో ఒక మెసేజ్ ను బలంగా చూపించడం కొరటాల శివ దర్శకత్వం స్పెషాలిటీ .

ఇది ఇలా ఉంటే దర్శకుడి గా కెరీర్ ని మొదలు పెట్టిన మిర్చి సినిమా నుండి శ్రీమంతుడు , జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న కొరటాల శివ తాజాగా విడుదలయిన ఆచార్య సినిమాతో మాత్రం పరాజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా ఆచార్య సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న కొరటాల శివ మరి కొన్ని రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నాడు. కొరటాల శివ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాట్లు గతంలో కొన్ని వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. కాకపోతే ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం చూస్తే కొరటాల శివ , ఎన్టీఆర్ మూవీ తర్వాత  రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: