ఆ టాలీవుడ్ క్రేజీ బ్యానర్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించనున్న సూర్య..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సూర్య తెలుగు లో కూడా అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే .

గజిని మూవీ తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య ఆ తర్వాత నుండి తాను నటించిన దాదాపు ప్రతి మూవీ ని తెలుగు లో డబ్ చేసి విడుదల చేస్తూ అనేక విషయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అందుకున్నాడు . మరీ ముఖ్యం గా సింగం సిరీస్ తో సూర్య టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు . కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో తెలుగు  లో టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి అయిన యు వి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోయే ఒక మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది . యు వి క్రియేషన్స్ సంస్థ సూర్య హీరోగా ఒక తెలుగు మరియు తమిళ భాషలో తెరకెక్కబోయే మూవీ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది .

అలాగే ఈ సినిమా కు కోలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి క్రేజ్ ను శివ ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఈ దర్శకుడు కోలీవుడ్ ఇండస్ట్రీ లో  అనేక విషయాలను అందుకున్నాడు . అలాగే టాలీవుడ్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన దరువు సినిమాకు శివ దర్శకత్వం వహించాడు . తాజాగా శివ , రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన పెద్దన్న సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: