'భూల్ భూలయ్యా-2' మూవీ కోసం కార్తిక్ ఆర్యన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రతి వారం అనేక సినిమాలు విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో స్టార్ హీరోలు నటించిన సినిమాలు మరియు స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయాలను సాధించడం లేదు.

గత కొద్ది కాలంగా బాలీవుడ్ స్టార్ హీరోలు , స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ వస్తున్నాయి . అలాంటి సమయం లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్వశక్తితో ఎదిగి చిన్న హీరో నుంచి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కార్తిక్ ఆర్యన్  నటించిన భూల్ భూలయ్యా-2 బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త కళను తీసుకువచ్చింది . మామూలు బడ్జెట్ తో తెరకెక్కి,  మామూలు అంచనాలతో థియేటర్ లలో విడుదల అయ్యి,  భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ కు పూర్వవైభవాన్ని తీసుకువచ్చింది. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో టబు ఒక కీలకమైన పాత్రలో నటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 20 వ తేదీన విడుదల అయ్యింది. విడుదల అయిన మొదటి షో నుండే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమాను టి సిరీస్ నిర్మించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం కార్తిక్ ఆర్యన్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం కార్తీక్ ఆర్యన్ 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు బి టౌన్ లో ఒక న్యూస్ హల్చల్ అవుతుంది. ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: