హీరో మాధవన్ ను ఏకిపారేసిన నెటిజన్స్.. కారణం..?

Divya
సినీ హీరో ఇప్పుడు డైరెక్టర్ గా మారినా హీరో మాధవన్ పై సోషల్ మీడియాలో తాజాగా ఒక ట్రోలింగ్ జరుగుతోంది. నోరు జారి మాట్లాడిన మాటలు మాధవ్ ను ఏకిపారేసిన ఎలా చేస్తున్నాయి. తెలియని విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడితే ఏమవుతుందో మాధవన్ చేసిన ఒక ఎపిసోడ్ ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. మాధవన్ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్. ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే మాధవ నెటిజన్ల చేతిలో పడ్డాడు.

దీనికి ముఖ్య కారణం అతను చేసిన వ్యాఖ్యలే. అంతరిక్షంలోకి రాకెట్లు పంపించేందుకు అంగారకుడి కక్ష్యలోకి అది చేరేందుకు ఇస్రోకు.. పంచాంగం సహాయం చేసింది అనే విషయాన్ని తెలిపారు మాధవన్. పంచాంగం చూసి పెట్టిన ముహూర్తబలం భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను దాటుకొని గ్రహగతులన్ని పంచాంగం లో చాలా నిర్దిష్టమైన ఉన్నాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో మాధవన్ ను పలువురు నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. ఈ వాక్యాలు చేయడంతో సైన్స్ పైన అవగాహన ఉన్నవారు మాత్రం నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు.

మాధవన్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో చాలా వైరల్ గా చేశారు. సైన్స్ గురించి తెలియని వారు పరవాలేదు కానీ ఏవి ఎలా పనిచేస్తాయో తెలియనప్పుడు మాట్లాడటం మంచిది కాదని ఓ యూజర్ మాధవన్ కు సలహా ఇవ్వడం జరిగింది.. మరొక నెటిజన్ మాత్రం మరీ ఇంత మూర్ఖత్వం అంటు కోప్పడ్డాడు. అభిమానులు మాత్రం మాధవన్ ఇలా వాక్యాలు చేసి ఉండాల్సింది కాదని విధంగా అభిప్రాయపడుతున్నారు. ఇక మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇస్రో ఇంజనీర్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో మాధవన్ టైటిల్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. ఒకేసారి ఈ చిత్రం అన్ని భాషల్లో కూడా విడుదల అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: