'పక్కా కమర్షియల్' మూవీ టికెట్ ధరలు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండనున్నాయో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన గోపీచంద్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా కెరీర్ ని మొదలు పెట్టి , ఆ తర్వాత విలన్ గా అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని, ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో హీరోగా నటించి అదిరిపోయే విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ ఇమేజ్ కలిగి ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న గోపీచంద్ తాజాగా పక్కా కమర్షియల్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో రాశిక న్నా హీరోయిన్ గా నటించగా మారుతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రావు రమేష్, సత్యరాజ్ కీలక పాత్రలలో నటించగా , ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించిన విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే కొన్ని చిన్న సినిమాలు మరియు తక్కువగా అంచనాలు సినిమాలు మాత్రం టికెట్ రేట్ లను భారీగా పెంచకుండా తక్కువ అ టికెట్ ధరల తోనే సినిమాను థియేటర్ లలో విడుదల చేస్తున్నారు.  

అందులో భాగంగా పక్కా కమర్షియల్ సినిమా కూడా తెలంగాణ రాష్టంలో సాధారణ టికెట్ రేట్ లతోనే థియేటర్ లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పక్కా కమర్షియల్ మూవీ టికెట్ రేట్లు మల్టీప్లెక్స్ థియేటర్ లలో 200 రూపాయల వరకు ఉండునట్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 రూపాయల వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలా సాధారణమైన టికెట్ రేట్ లతోనే పక్కా కమర్షియల్ మూవీ ని తెలంగాణలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: