హీరోయిన్ టబు కి పెళ్లి కాకపోవడం వెనుక అజయ్ దేవగణ్ పాత్ర ఇదేనా?

VAMSI
వయసు నాలుగు పదులు దాటుతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోని సీనియర్ నటులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. పలు కారణాల వలన కొందరు హీరో, హీరోయిన్లు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. కొందరయితే 50 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్న వారు ఉన్నారు. ఇదే తరహాలో సీనియర్ స్టార్ హీరోయిన్ టబు కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నారు. ఈమె వయసు 50 దాటుతున్నా పెళ్లి ఊసే లేదు. ఇప్పటికే సగం వయసు దాటిపోయింది ఇకపై చేసుకుంటారా అన్నది సందేహమే.
ఒకప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లలో ఒక వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు అంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది అని అంతా అనుకుంటుంటారు. అందం, ఆస్తి పాస్తులు, పేరు ప్రతిష్టలు అన్ని ఉండి కూడా టబు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అవన్నీ పక్కన పెడితే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న హీరోయిన్ టబు నేను ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోడానికి కారణం బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి గురించి రాగా... నాకు పెళ్ళి కాకపోవడానికి కారణం అజయ్ దేవగన్ అంటూ షాకింగ్ కామెంట్ చేశారు టబు.  అజయ్ నా కజిన్ సమీర్ ఆర్య ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. అంతే కాదు అజయ నాకు మంచి స్నేహితుడు. నా చిన్నప్పటి నుండి సమీర్, అజయ్ ఇద్దరు కూడా నాపై ఓ కన్నేసి ఉంచేవారు. ఎపుడు నా వెనకే తిరుగుతూ ఫాలో అయ్యేవాళ్ళు. అయితే అదంతా కూడా  నన్ను జాగ్రత్తగా చూసుకోడానికే. ఎవరైనా అబ్బాయిలు నా వైపు చూసినా, నాతో మాట్లాడాలని వెంటపడినా ఇక వారికి అజయ్ దగ్గర మూడిందే.  వారిని పిలిచి మరీ అజయ్ తిట్టి, కొట్టి తరిమేసేవాడు.
మొత్తానికి రౌడీల్లాగా బిహేవ్ చేసేవాళ్ళు. అలా అజయ్ కారణంగా  అబ్బాయిలు నన్ను చూడాలంటేనే భయపడేవారు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇప్పటికీ ఒంటరిగా ఉన్నాను అంటే అందుకు అజయ్ కారణం అని చెప్పొచ్చు అంటూ సిల్కీ గా నవ్వేశారు టబు. అజయ్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఇక పెళ్లి విషయానికి వస్తే . నిజం చెప్పాలంటే నాకు పెళ్లి కాలేదని నేను ఎపుడు బాధపడింది లేదు.., తప్పుడు భాగస్వామిని ఎంచుకోవడం కంటే సింగిల్ గా ఉండటమే ఎంతో మంచిది అన్నది నా అభిప్రాయం. అంటూ చెప్పుకొచ్చారు టబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: