సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు మరో విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అనుకొన్నాడు. బ్రహ్మోత్సవం, స్పైడర్ మూవీ లతో వరుసగా బాక్స్ ఆగిన్ దగ్గర అపజయాలను ఎదుర్కొని... ఆ తర్వాత భరత్ అనే నేను మూవీ తో మొదలు పెట్టి మహర్షి , సరిలేరు నీకెవ్వరు , సర్కారు వారి పాట మూవీ లతో వరుసగా నాలుగు విజయాలను అందుకున్న మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా కాలమే అవుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో హీరోయిన్ పూజా హెగ్డే నటించబోతున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత పూజా హెగ్డే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పు ఉంది అని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే పూజా హెగ్డే ఈ మూవీ నుండి తప్పుకుంది అని వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని తెలుస్తోంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ లో పూజా హెగ్డే ను హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది అని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా రెండు సినిమాలు తెరకెక్కాయి. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే సినిమా వీరి కాంబినేషన్ లో మూడవది.