బాలకృష్ణ... అనిల్ రావిపూడి సినిమాకు క్రేజీ టైటిల్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ పోయిన సంవత్సరం బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో అదిరిపోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. అఖండ సినిమాతో బాలకృష్ణ 100 కోట్ల కలెక్షన్ లకు పైగా కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించాడు.

అఖండ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకు బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ సినిమా ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 107 వ సినిమా కావడంతో ఈ సినిమాకు ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా, ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా విడుదల అయిన ఎన్ బీ కే 107 టీజర్ లో బాలకృష్ణ తన మాస్ మేనరిజాన్ని మరొకసారి చూపించి, డైలాగులతో ప్రేక్షకులను అలరించాడు.  ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో నటించబోతున్నాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ 50 ఏళ్ల వయస్సు వ్యక్తిగా కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీ లీల కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం నట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... బాలకృష్ణ సినిమాకు 'బ్రో ఐ డోంట్ కేర్' అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో చిత్ర బృందం కున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: