ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా  ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇలా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు అధికారికంగా చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇలా 'ఆర్ ఆర్ ఆర్' లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ నటించబోయే తదుపరి రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందాలు విడుదల చేశాయి. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్, బుచ్చిబాబు కాంబినేషన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది అని చాలా మంది భావించారు.

కానీ ఎన్టీఆర్,  బుచ్చిబాబు కాంబినేషన్ కు సంబంధించిన ఎలాంటి వార్త ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు బయటకు రాలేదు. దానితో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండదు అనే వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు వీరిద్దరి కాంబినేషన్ కు సంబంధించిన సినిమా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ మరి కొన్ని రోజుల్లోనే వీరిద్దరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పై బుచ్చిబాబు  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: