ప్రగతి ఆంటీ కొంతకాలం సినిమాలకు ఎందుకు దూరం అయింది?

VAMSI
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఎఫ్ 3 చిత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ అందుకుంటోంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. రెండు తెలుగు రాష్ట్రాల్లోను హిట్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టిన సంతోషంలో టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా టీం మెంబెర్స్ ఒక్కొక్కరు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే నటి ప్రగతి వ్యాఖ్యలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ హైలెట్ అయ్యారు ప్రగతి. ఇంతకీ ఆమె ఏమన్నారు అంటే...
 
గత చిత్రాల్లో తాను పోషించిన కొన్ని పాత్రలు పెద్దగా సంతృప్తి ఇవ్వలేదని చెప్పారు. కెరియర్ ప్రారంభించింది మొదలు తన సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలను చేశాను. కానీ కొన్ని ఊహించిన స్థాయిలో తనకు సంతోషాన్ని ఇవ్వలేదని అన్నారు.  తనకు తగ్గ పాత్రలు పడలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎఫ్ 2 చిత్రంలో తన పాత్ర తన మనసుకి ఫుల్ ఫిల్ గా అనిపించింది అని ఎఫ్ 3 లోనూ అది కంటిన్యూ అయ్యిందని చెప్పుకొచ్చారు.
అందమైన, యంగ్‌ అమ్మగా, పెద్ద విలన్‌ ల పక్కన నిలబడే పాత్రలతో పలు చిత్రాల్లో సెట్‌ ప్రాపర్టీలాగా కనిపించాను. కానీ అటువంటి పాత్రలు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు సంతృప్తికరంగా అనిపించలేదు.
అలాంటి పాత్రలతో విసుగొచ్చి మధ్యలో సినిమాలకు కొద్ది రోజులు దూరమయ్యాను.  అలా నిరాశలో ఉండగా  'ఎఫ్‌3' రూపం లో అదృష్టం కలిసి వచ్చింది. అందులో నా పాత్రకు మంచి గుర్తింపు ఆశించిన స్థాయిలో అభిమానం దక్కింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నటు ప్రగతి. అయితే ఎపుడు నిండు చీర కట్టులో ఎంతో సంప్రదాయకంగా అమ్మ పాత్రల్లో కనిపించే ప్రగతి ఈ మధ్య సోషల్ మీడియాలో దూకుడు పెంచిన విషయం తెలిసిందే. యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఫుల్ జోష్ తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు నటి ప్రగతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: