రష్మిక మాజీ లవర్ ఈ హీరోయిన్ వివాహం చేసుకుంటున్నాడా

Divya
గీతగోవిందం చిత్రంతో మొదటిసారిగా హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక మందన. తన కెరీర్ మొదలు పెట్టిన ఐదేళ్లలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం యువ కథానాయకిగా వెలిగిపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో కూడా తన కెరీర్ని ప్రారంభిస్తోంది. రష్మిక తన కెరీర్ ని మొదట కన్నడ రంగంలో ప్రారంభించింది అక్కడ తన తొలి చిత్రంలో నటించిన హీరో, నిర్మాత రక్షిత్ చిట్టి తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత నిశ్చితార్థం కూడా చేసుకొని పెళ్లి వేడుకను క్యాన్సిల్ చేసుకుంది.
ఇక ఆ తర్వాత టాలీవుడ్ లోకి చలో చిత్రం ద్వారా తన కెరీర్ను ప్రారంభించింది రష్మిక. ఇక ఇదే క్రమంలో రక్షిత్ కూడా సినిమాల పైన ఫోకస్ పెట్టాడు. అలా వీరిద్దరూ ఎవరు సినిమాలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. రక్షిత్ నటించిన కన్నడ చిత్రాలు తెలుగులో పాటు పలు భాషలలో విడుదల అయ్యి రష్మిక కంటే ఒక మెట్టు పైనే ఉండాలనే పంతం తో  ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రక్షిత్ నటించిన చార్లీ 777 సినిమా విడుదల చేసే పనిలో ఉన్నారు అయితే ఎలా పుట్టించారు కాని రక్షిత్ వివాహం గురించి ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారుతోంది.
రక్షిత్ శెట్టి త్వరలోనే రమ్య ఆకా దివ్య స్పందన తప్ప మరో వివాహం చేసుకోనని తెలియజేసినట్లు గా సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. రక్షిత్ శెట్టి రమ్యా పై వస్తున్న ఈ రూమర్లు స్నేహితుడు రిషబ్ శెట్టి  స్పందించడం జరిగింది. తన స్నేహితుడు రక్షిత శాండిల్వుడ్ గోల్డెన్ గర్ల్ అని వివాహం ఆడలేదని క్లారిటీ ఇచ్చాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్ వెల్లడించినట్లు గా కేవలం రక్షిత్ వివాహం చేసుకోబోతున్నారని పుకార్లు పుట్టించారు అని తెలియజేశారు. ఇప్పటి వరకు ఆమె అసలు చూడలేదని రక్షిత కూడా తెలియజేశారు. కేవలం ఆమె తన క్రష్ అని ఒప్పుకున్నాడు రక్షిత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: