రామ్ పోతినేని 'ది వారియర్' టీజర్ రెస్పాన్స్ మామూలుగా లేదుగా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ యువ హీరోల్లో ఒకరైన రామ్ పోతినేని గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని,  వై వి యస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా తోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న రామ్ పోతినేని ఆ తర్వాత రేడీ ,  కందిరీగ , ఈస్మార్ట్ శంకర్ వంటి  విజయవంతమైన సినిమాలతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న రామ్ పోతినేని చివరగా రెడ్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన రెడ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్స్ ను సాధించింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ పోతినేని 'ది వారియర్' అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.  తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో  విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  ది వారియర్ టీజర్ 24 గంటలకు గాను 9.38 మిలియన్  వ్యూస్ ను , 280.9 కే లైక్ లను సాధించింది. ఈ మూవీ టీజర్ లో రామ్ పోతినేని పోలీస్ లుక్ లో అదరగొడుతున్నడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: