అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల 'పెళ్లి సందD' మూవీ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే శ్రీ లీల తన నటనతో, అందచందాలతో, డాన్స్ లతో ప్రేక్షకులను కట్టి పడేసింది. అలా మొదటి సినిమా తోనే ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన శ్రీ లీల కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.
అందులో భాగంగా ప్రస్తుతం శ్రీ లీల ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ వంటి సినిమా లకు దర్శకత్వం వహించిన త్రినాధరావు నక్కిన ధమాకా సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా కేవలం ఒకే ఒక్క మూవీ లో నటించి మాస్ మహారాజా రవితేజ సరసన చాన్స్ కొట్టేసిన శ్రీ లీల నందమూరి నట సింహం బాలకృష్ణ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా లతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే ఒక మూవీ లో కూడా శ్రీ లీల కు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా శ్రీ లీల వరస పెట్టి స్టార్ హీరోల సరసన చాన్స్ లను దక్కించుకుంటూ తన కెరియర్ ను ఫుల్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్ళి పోతుంది. మరి అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి అవకాశాలను దక్కించుకుంటుందో చూడాలి.