మార్క్ ఆంటోనీ గా రాబోతున్న విశాల్..!

Pulgam Srinivas
కోలీవుడ్ హీరోల్లో ఒకరైన విశాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  విశాల్ 'పందెం కోడి'    మూవీ తో  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. పందెం కోడి సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయం గా నిలవడంతో అప్పటి నుండి విశాల్ నటించిన దాదాపు ప్రతి సినిమాని తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు.  అలా ఇప్పటి వరకు ఎన్నో సినిమా లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసిన విశాల్ అందులో భాగంగా కొన్ని విజయాలను కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. 

విశాల్ ఈ మధ్య కాలంలో  డిటెక్టివ్,  అభిమన్యుడు మూవీ లతో టాలీవుడ్  బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను  అందుకొన్నాడు.  ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విశాల్  'సామాన్యుడు'  మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. డింపుల్ హాయతి హీరోయిన్ విశాల్ హీరోగా తెరకెక్కిన సామాన్యుడు సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ మరో కొత్త మూవీ ని ప్రారంభించాడు. 

అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ మూవీ కి  'మార్క్ ఆంటోనీ'  అనే టైటిల్ ని చిత్ర బృందం ఖరారు చేసింది.  తాజాగా చెన్నై లో పూజా కార్యక్రమాలతో  ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.  ఈ సినిమాలో రీతూ వర్మ , విశాల్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది.  ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్ జే సూర్య కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.  పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ఎస్. వినోద్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: