స్వర్గీయ ఎన్టీఆర్ కృష్ణం రాజుకు అంత విలువిచ్చారా ?

VAMSI
పట్టిందల్లా బంగారం అయిపోవాలి అంటే అందరికీ జరిగే పని కాదు. ఇపుడు మన ముందు స్టార్ హీరోలుగా ఉన్న చాలామంది హీరోలు ఒకప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని సమస్యలను దాటుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నవారే. అలాంటి వారిలో ఒకరు టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల మన్నలను పొంది వారితో రెబల్ స్టార్ అనిపించుకున్న ఈ సీనియర్ నటుడి సినీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. చిలక గోరింక సినిమాతో మూడవ తరం హీరోగా సినీ జీవితాన్ని మొదలు పెట్టిన కృష్ణం రాజు కొన్నాళ్ళు హీరోగా ఆ తర్వాత విలన్ గా ట్రై చేసి మళ్ళీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో తిరిగి హీరోగా మారి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. తన సినీ జీవితం లో అలా 60 చిత్రాలకు పైగా నటించారు రెబల్ స్టార్.
ఇక ఈయన నట ప్రస్థానం లో ఎన్నో ప్రయోగాలు చేశారనే చెప్పాలి. అప్పటి టైం లో మాజీ మంత్రి నిర్మాత అయిన హరిరామ జోగయ్య కృష్ణంరాజు మరియు శోభన్ బాబు లతో బంగారు తల్లి అనే సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం ద్వారా నిర్మాత జోగయ్య కృష్ణంరాజు  ఇద్దరు మధ్య స్నేహం ఏర్పడింది. అలా వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే ఒకానొక సమయంలో జోగయ్య ఆర్ధికంగా బాగా నలిగిపోయి ఉన్న సమయంలో తన స్నేహితుడికి అండగా నిలవాలని అనుకున్న కృష్ణంరాజు అతనితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే అప్పట్లో సంచలన విజయాన్ని సాధించిన కన్నడ చిత్రం శరపంజర అనే మూవీని తెలుగులో రీమేక్  చేయాలని నిర్ణయించుకున్నారు. హరిరామ జోగయ్య మరియు చలసాని మధుసూదన నిర్మాతలుగా కృష్ణంరాజు వాణిశ్రీ లు హీరోహీరోయిన్లుగా సినిమాను స్టార్ట్ చేశారు.
అయితే ఈ మూవీని బ్లాక్ అండ్ వైట్ లో కాకుండా కలర్ లో తీస్తే ఇంకా మంచి ఫలితం వస్తుందని భావించిన కృష్ణంరాజు అదే విషయాన్ని నిర్మాతలకు చెప్పగా వారు అంత ఆర్ధిక స్తోమత ప్రస్తుతం మాకు లేదు అనడంతో దైర్యం చేసి ఆ సినిమా నిర్మాణం లో భాగస్తుడు అయ్యాడు. సినిమా పూర్తయ్యాక ఆ చిత్రాన్ని మొదటగా అన్న ఎన్టీఆర్ కు చూపించారు. సినిమా చూసిన ఎన్టిఆర్ సినిమా చాలా అద్భుతంగా ఉంది బ్రదర్, చాలా పెద్ద సాహసమే చేశావు, ఫలితం కూడా తప్పక దొరుకుతుంది అని అన్నారట. అయితే ఆ తరవాత తారక రామారావు గారు అన్నట్లే సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. 100 రోజుల సినిమాగా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది. కాగా ఈ సినిమా విజయవంతం అయిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకు న్నారు...ఆ ఫంక్షన్ కు అన్న ఎన్టీఆర్ ను స్వయంగా కృష్ణంరాజు వెళ్లి పిలవగా మొదట కుదరదు బ్రదర్ చూస్తాను అన్నప్పటికి ఆ తరవాత వీలు చేసుకుని సతీ సమేతంగా సినిమా సక్సెస్ మీట్ కు వెళ్లి కృష్ణంరాజు అభినందించారట అన్న నందమూరి తారక రామారావు.  అలా కృష్ణంరాజుకు అంత బిజీ లో కూడా విలువిచ్చారు అని ఇప్పటికీ అందరూ చెప్పుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: