ఎమోషనల్ అయిన రాజశేఖర్.. కారణం ఏమిటంటే..!!

Divya
యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ప్రస్తుతం తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడని చెప్పవచ్చు. బలమైన కథలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ మంచి హిట్ అందుకుంటున్నాడు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గరుడవేగ సినిమా రాజశేఖర్ కు ఒక సాలిడ్ హిట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక వెంటనే కల్కి చిత్రంతో విభిన్నమైన కథతో ప్రేక్షకుల వద్దకు రాగా ఈ సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం రాజశేఖర్ మరొకసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ డైరెక్టర్ గా ఒక సినిమా ముందుండి నడిపించింది. ఈ సినిమాకి నిర్మాతగా సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే శేఖర్ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ట్రైలర్ రిలీజ్ కు భారీ స్పందన రావడంతో హీరో రాజశేఖర్ ఎమోషనల్  తో  విషయాన్ని తెలియజేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ తన సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. కరొనా సమయంలో తన పరిస్థితి చాలా సీరియస్ గా ఉండడం జరిగింది.
కేవలం మీ అందరి ప్రేమ వల్ల మేము బతికి బయట పడ్డాము. అభిమానులు, శ్రేయోభిలాషుల అందరి ప్రార్థనలే మమ్మల్ని బతికించాయని తెలియజేశారు. డైరెక్టర్ పవన్ చెప్పినట్లుగానే తమకు సినిమాలు అంటే చాలా ప్రాణమని.. ఈ సినిమాను మేమంతా ఎంతో ప్రాణం పెట్టి తీశాము. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉండగా కొన్ని పరిస్థితుల వల్ల ఆలస్యం అవుతోంది. ఎట్టకేలకు ఈ సినిమాని తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము.. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి బాగుందని అంటేనే మా చిత్రాన్ని చూడండి అని తెలియజేశాడు. ఇక దీంతో తన సినిమాపై తనకు నమ్మకం ఉంటేనే ఇలా చెప్పామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: