మెగాస్టార్ సినిమాలపై మెగా ఫ్యాన్స్ అసహనం!

Purushottham Vinay
రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు తీస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇక చిరంజీవి రాకతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కానీ అపజయం ఎరుగని దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇండస్ట్రీకి ఇచ్చి ఆశ్చర్య పరిచిన కొరటాల శివ ఆచార్య లాంటి మెగా ఫ్లాఫ్ ఇస్తాడని ఫ్యాన్స్ కలలో కూడా అసలు ఊహించి వుండరు. కొరటాల శివ పై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. బ్లాక్ బస్టర్ మాట పక్కన పెడితే కనీసం ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే సినిమా ఇస్తాడని అంతా కూడా అనుకున్నారు.కానీ అసలు ఎవరూ ఊహించని విధంగా మహా దారుణమైన ఫలితం వచ్చింది. కొరటాల శివ ఇచ్చిన షాక్ తో ఇప్పుడు మెగా లైనప్ ఫాన్స్ లో టెన్షన్ పట్టుకుంది. మెగాస్టార్ వి మూడు సినిమాలు ఇప్పుడు సెట్స్ పై వున్నాయి. ఇందులో రెండు సినిమాలు రీమేకులు. కథ పరంగా ఓకే గాని అవి ఒక బాషలో ఆదరించిన కథలే. ఐతే అది ఇక్కడ హిట్టు అవ్వాలనే రూలు కూడా లేదు.


పైగా గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాకి మెగా పల్స్ ఎలా పట్టుకుంటాడో అనే భయం కూడా వుంది అభిమానుల్లో.ఇక భోళా శంకర్ సినిమా చేస్తున్న మెహర్ రమేష్ ని చాలా మంది మర్చిపోయారు. అలాంటి మెహర్ రమేష్ కి సినిమా అప్పగించారు మెగాస్టార్. మెహర్ రమేష్ ఇచ్చే అవుట్ పుట్ పై కూడా ఒక డౌటు. ఇక మూడో సినిమా బాబీది. ఇది వరిజినల్ కథే అయిన  వచ్చిన సమస్య ఏంటంటే బాబీకి అనుభవం సరిపోవడం లేదని టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే బాబీ సినిమాపై కొంచెం అసంతృప్తిగా వున్నారని కూడా సమాచారం తెలిసింది. మెగా పల్స్ పట్టుకోవడంలో బాబీ తడబాడు కనిపిస్తుందని ఇన్ సైడ్ టాక్ అనేది గట్టిగా. ఇక బాబీ గత సినిమా వెంకీ మామ. ఆ సినిమా జస్ట్ యావరేజ్ మాత్రమే. ఇంకా అదే కాకుండా పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తో ఇంకో మెగా ఫ్లాఫ్ కూడా వుంది. ఇవన్నీ మెగా అభిమానులని బాగా కలవరపెడుతున్న విషయాలే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: