నేపాల్ లో కూడ జూనియర్ కు అన్యాయం ?

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికి ఈ మూవీ కలక్షన్స్ 11వందల కోట్ల రేంజ్ దాటడంతో రాజమౌళి మ్యానియా మరొకసారి రుజువైంది. ముఖ్యంగా ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించిన రామ్ చరణ్ పై విపరీతమైన ప్రశంసలు నేషనల్ మీడియాలో రావడంతో బాలీవుడ్ లో చరణ్ పేరు మారుమ్రోగిపోతోంది.

ఈ సినిమాలో రాజమౌళి జూనియర్ చరణ్ లకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చినప్పటికీ జనం మాత్రం చరణ్ పాత్రకే ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో రాణించాలి అని కలలు కన్న జూనియర్ కల ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో ఏమాత్రం నెరవేరలేదు. ఈమూవీని జపాన్ చైనా భాషలలో కూడ విడుదల చేయడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా నేపాల్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి రాజమౌళి కూడ ఊహించని అనూహ్య స్పందన వస్తోంది. నేపాల్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ హిందీ వర్షన్ కు రికార్డు స్థాయిలో కలక్షన్స్ వస్తున్నాయి. దీనితో నేపాల్ మీడియా ఈమూవీని ఆకాశానికి ఎత్తేస్తూ అనేక ఆసక్తికర కథనాలు ప్రచురిస్తోంది.

అయితే నేపాల్ మీడియా ప్రశంసలు మాత్రం రామ్ చరణ్ కే ఎక్కువగా ఉన్నాయి. అతడు పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను హైలెట్ చేస్తూ చరణ్ అల్లూరి లుక్ తో కూడిన ఫోటోలను నేపాల్ లోని ప్రముఖ పత్రికలు ప్రచురిస్తున్నాయి. దీనితో నేపాల్ మీడియాకు చరణ్ హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఈమూవీలో జూనియర్ చరణ్ తో సమానంగా నటించినప్పటికీ నేపాల్ మీడియా కూడ పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ లో జూనియర్ కు అన్యాయం జరిగింది అంటూ తారక్ అభిమానులు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నేపాల్ మీడియా కూడ జూనియర్ కంటే చరణ్ కు ప్రాధాన్యత ఇవ్వడం జూనియర్ అభిమానులు అవమానంగా ఫీల్ అవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: