అందుకే రష్మిక జెర్సీ సినిమా నో చెప్పిందట.. కారణం..!!

Divya
నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.. డైరెక్షన్ లో వచ్చిన చిత్రం జెర్సీ. ఇక ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిన విషయమే.. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కించి తెలుగులో ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఎమోషన్ సీన్స్.. నాని నటన అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కు బ్రహ్మరధం పట్టారు. సౌత్లో ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమాని.. అదే పేరుతో హిందీలో రీమేక్ చేయడం జరిగింది.
ఈ సినిమాని బాలీవుడ్ లో హీరోగా షాహిద్ కపూర్, హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఇక ఈ చిత్రంలో హీరో పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందా హీరోయిన్ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు.. అయితే సినిమాలోని పాత్రకు శ్రద్ధా శ్రీనాథ్.. సరైన న్యాయం చేసిందని విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. అయితే బాలీవుడ్లో ముందుగా ఈ సినిమాలో మొదట రష్మిక ను చిత్రబృందం సంప్రదించగా.. అయితే రష్మిక ఈ సినిమాలో నటించానని తేల్చి చెప్పినట్లు గతంలో వార్తలు వినిపించాయి.
ఇక ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా ఇదే ప్రశ్న రష్మీ కాకు ఎదురవ్వగా ఈ విషయాన్ని తెలియజేసినట్లు గా తెలుస్తోంది. రష్మిక మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించేందుకు ఆఫర్ వచ్చిన తను నటించక పోవడానికి కారణాలు తెలుపుతూ.. జెర్సీ ఒక రియలిస్టిక్ చిత్రం.. ఇక ఈ సినిమా తెలుగులో నటించి శ్రద్ధ శ్రీనాథ్ పాత్రకు ప్రాణం పోసింది.. ఆ పాత్రను తన కన్నా గొప్పగా ఎవరు చేయలేరు అని తన ఉద్దేశ్యం అని రష్మిక తెలిపింది. ఇక అలాంటి పార్టీలకు నేను కరెక్ట్ కాదనిపించింది.. ఇక తన వల్ల దర్శక, నిర్మాతలు నష్టపోకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.. అందుచేతనే హిందీ వెర్షన్లో జెర్సీ సినిమా కి నో చెప్పానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: