పాన్ ఇండియా ఒత్తిడిలో ‘సినీ ఇండస్ట్రీలు’..!!

N.ANJI

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలు పాన్ ఇండియా సినిమాలపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. టాలీవుడ్‌లో ‘బహుబలి’ సినిమా తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘పాన్ ఇండియా సినిమాలు’. ప్రస్తుతం డైరెక్టర్లు ఏ సినిమా తీసినా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని ఫిక్స్ అవుతున్నారు. భాష, ప్రాంతం సంబంధం లేకుండా తమ సినిమా ప్రేక్షకులకు చేరుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలైతేనే మంచి వసూళ్లు రాబట్టవచ్చని అనుకుంటున్నారు. అయితే ఈ మేరకు ఆ స్థాయి సినిమాలు రిలీజ్ చేసి విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీపై ఒత్తిడి పెరిగింది. సినిమా స్టోరీ, నిర్మాణ శైలి, మార్కెట్ వ్యూహాలు మరింతగా మార్చేస్తున్నారు.


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అన్ని భాషల్లో భారీగా వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలోని ‘తగ్గేదెలే’ డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. అందరి నోట ఆ డైలాగ్ మార్మోగింది. అలా పాన్ ఇండియా సినిమాలు దేశంలో నలుమూలలా సినీ ఇండస్ట్రీలపై ప్రభావం చూపిస్తున్నాయి. బాలీవుడ్‌కు సంబంధించిన చిత్రాలు దేశం మొత్తం మార్కెటింగ్ అవుతుంటాయి. ఒకరకంగా చూస్తే పాన్ ఇండియా స్థాయి సినిమాల నిర్మాణం వాళ్లకు అలవాటనే చెప్పుకోవచ్చు. అయితే ఓ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే సాంకేతిక హంగులతో తీయాల్సిందే. ఈ స్థాయిలో సినిమా తీయాలంటే చిన్న పరిశ్రమలకు సాధ్యమయ్యేది కాదు. టాలీవుడ్‌లో ‘బహుబలి’ సినిమా తర్వాత మార్కెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.


మంచి స్టోరీ, దాటిని తగ్గట్లు నిర్మాణం, మార్కెటింగ్ వ్యూహం ఉంటే భారీ విజయాన్ని అందుకోవచ్చని ‘బహుబలి’ నిరూపించింది. అప్పటి నుంచి సౌత్‌లో పాన్ ఇండియా సినిమాపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2’ చిత్రాలకు మొదటి వారం వచ్చిన వసూళ్లు అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌లోనూ ఆ స్థాయి వసూళ్లు రాబట్టలేదు. రూ.100 కోట్లు రాబట్టడమే గగనమైంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి బాలీవుడ్‌పై పడింది. బాలీవుడ్‌లో మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు ఉండకపోవడంతో ప్రేక్షకులు సౌత్ వైపు మొగ్గు చూపిస్తున్నారని సమాచారం. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ స్పందించినట్లు సమాచారం. స్టోరీ ఎంపికలో బాలీవుడ్ ప్రత్యేక దృష్టి సారించేలా ప్లాన్ చేస్తోంది. అయితే టాలీవుడ్‌లోనూ ఈ సమస్య తలెత్తుతోంది. మొన్నటివరకు ప్రభాస్ ఒక్కరే పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా చేరారు. దీంతో వీరు తీసే సినిమాలు ఆ మార్కెట్ లక్ష్యంగానే రూపొందించాల్సిందేనని టాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఆలోచిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: