ఫైట్ మాస్టర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ సినిమాలో నలుగురు హీరోలట..!!

N.ANJI
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ నటించారు. మాట్ని ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడెక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ‘ఆచార్య’ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈమెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు మెగా అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ ఈవెంట్‌కు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. సంప్రదాయ పంచ కట్టుకుని విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్-లక్ష్మణ్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసే మా జీవితం స్టార్ట్ అయిందన్నారు. ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉన్నారన్నారు. అలాగే ఈ సినిమాలో ‘ధర్మం శరణం గచ్ఛామి’ అని ఉంటుందని, ధర్మం పాటించుకుంటూ వెళ్లాలని ఈ సినిమా చెబుతుందన్నారు. సనాతన ధర్మం, నాటు వైద్యం, సత్యం గురించి ఈ సినిమాలో అద్భుతంగా వివరించడం జరుగుతోందన్నారు. ధర్మాన్ని చెప్పగలిగే చిరంజీవితోనే ఈ సినిమా తీయడం జరిగిందన్నారు. రామ్‌చరణ్ పాత్ర ఎంతో డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా ఉండబోతుందన్నారు. ఈ సినిమాలో తమకు అవకాశాలు ఇచ్చిన కొరటాల శివకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సినిమాలో చిరంజీవి వయసు 66 కాదని, 16 ఏళ్ల యువకుడిలా నటించారని పేర్కొన్నారు. ఆ తర్వాత భలే భలే బంజారా సాంగ్‌కి డ్యాన్స్ చేశారు. కాగా, ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి విడుదలై టీజర్, ట్రైలర్ విడుదలై భారీ స్పందన వచ్చిందన్నారు. అలాగే ‘లాహే లాహే, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా’ సాంగ్స్ కూడా బాగున్నాయన్నారు. కాగా, ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: