వైరల్ వీడియో.. కేజిఎఫ్ చాప్టర్ 2 విజయంపై.. యష్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
కన్నడ హీరో యష్ ప్రధానపాత్రలో నటించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఇటీవలే ఏప్రిల్ 14వ తేదిన విడుదలైంది. ప్రేక్షకుల అంచనాలను మించిన విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు నాలుగు వందల అరవై ఐదు కోట్ల వసూళ్లు సాధించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా త్వరలోనే 1000 కోట్లు వసూళ్లు సాదించిన సినిమాల జాబితాలో చేరేందుకు సిద్ధమయింది. ఇక ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా హవా కొనసాగుతుంది అని చెప్పాలి.

 కే జి ఎఫ్ సినిమా తో భారత దేశ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయిన కన్నడ హీరో యష్ కే జి ఎఫ్ చాప్టర్ 2 తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అనే చెప్పాలి. కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాలో యష్ చేసిన యాక్షన్ చూసిన తర్వాత అతని కోసం ప్రత్యేకమైన కథను సిద్ధంచేస్తూ ఉన్నారు అన్ని భాషల దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఊహించని రేంజిలో కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇటీవలే కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా విజయంపై హీరోయిన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యష్. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో ని విడుదల చేశాడు.

 ఒకానొక సమయంలో ఒక గ్రామానికి తీవ్రమైన కరువు వచ్చింది. అప్పుడు గ్రామస్తులంతా దైవాన్ని ప్రార్థించేందుకు ఒకచోట చేరారు. కానీ ఒక అబ్బాయి మాత్రం అక్కడికి గొడుగుతో వెళ్ళాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అబ్బాయి  చేసిన పనికి నవ్వుకున్నారు   కొందరు అతడిది మూర్ఖత్వం అంటే మరి కొంతమంది అతి విశ్వాసం అని అనుకున్నారు. కానీ ఈ రెండూ కాదు అది నమ్మకం. అప్పుడు ఆ అబ్బాయి ఏ నమ్మకంతో అయితే ఉన్నాడో కేజిఎఫ్ విషయంలో నేను అదే నమ్మకంతో ఉన్నాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందించిన విజయానికి థాంక్స్ అనే పదం చిన్నది అవుతుంది. అద్భుతం లాంటి సినిమాలు ఇవ్వాలి అనుకున్నాను. అనుకున్నట్లుగానే అందించాం.. ఇక రానున్న రోజుల్లో కూడా సినిమాలను అలాగే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా.. మీకు ముందే చెప్పాను కదా యువర్ హర్ట్ ఇస్ మై టేరటరీ అంటూ డైలాగ్ చెప్పి అలరించాడు యష్..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: