వామ్మో: అలియా-రణ్‌బీర్‌కు వచ్చిన పెళ్లి కానుకలివే..?!

N.ANJI

ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ అయిన అలియా భట్, రణ్‌బీర్ కపూర్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ.. పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, కరిష్మా కపూర్, అయాన్ ముఖర్జీ, కరణ్ జోహర్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, ఆకాశ్ అంబానీ తదితరులు ఈ గ్రాండ్ వెడ్డింగ్ పాల్గొన్నారు. అలాగే చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే వీరి పెళ్లికి ఖరీదైన కానుకలు అధిక సంఖ్యలో వచ్చాయి. కత్రినా కైఫ్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్ వంటి సెలబ్రిటీలు ఈ కొత్త దంపతులకు ఖరీదైన ఆభరణాలు, బహుమతులు అందజేశారు.


రణ్‌బీర్ కపూర్‌తో కలిసి పలు సినిమాల్లో నటించిన కత్రినా కైఫ్ నూతన దంపతులకు రూ.14.5 లక్షల విలువైన ప్లాటినం బ్రేస్‌లెట్‌ను బహుమతి ఇచ్చారు. అలాగే దీపికా పదుకొణె ఇద్దరికీ విడివిడిగా ఖరీదైన వాచ్‌లను కానుకగా ఇచ్చారట. అలాగే దీపిక భర్త రణ్‌వీర్ సింగ్ లగ్జరీ బైక్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు. అలియా భట్ ఫస్ట్ మూవీ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ హీరోగా నటించారు. వీరు మొదటి నుంచే మంచి స్నేహితులు. 


ఈ మేరకు సిద్ధార్థ్ అలియాకు రూ.3 లక్షల విలువైన హ్యాండ్ బ్యాగ్, వరుణ్ రూ.4 లక్షల విలువైన సాండట్స్ పెళ్లి కానుకగా ఇచ్చారు. అలాగే ప్రియాంక చోప్రా రూ.9 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్, కరీనా కపూర్ రూ.3 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్, అలియా తల్లి సోనీ రజ్దాన్ అల్లుడికి రూ.2.5 కోట్ల ఖరీదైన వాచ్‌ బహూకరించారు. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ ఏకంగా రూ.26 కోట్లతో విలాసవంతమైన ఫ్లాట్‌ను ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: