వర్మ సరికొత్త ఫ్యాక్షన్ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్..!!

Divya
 డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు.. ఈ దర్శకుడి నుంచి ఏదైనా చిత్రం వస్తోందంటే చాలు ఎక్కువగా కాంట్రవర్సీలు వస్తూనే ఉంటాయి. సినిమా టైటిల్ ప్రకటించిన్నప్పటి నుండి సినిమా విడుదలయ్యే వరకు ఏదో ఒక వార్త హల్చల్ అవుతూనే ఉంటుంది. వర్మ సినిమాలనే కాకుండా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ వాటిని విడుదల చేస్తూ కాంట్రవర్సీ లకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. అలా వర్మ కొంతమంది దర్శకులను కూడా పరిచయం చేశారు అలాంటి వారిలో అగస్త్య మంజు కూడా ఒకరు.
ప్రస్తుతం ఈ డైరెక్టర్ డైరెక్షన్లోనే దహనం అనే ఒక వెబ్ సిరీస్ ను కూడా నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ MX ప్లేయర్ లో ఏప్రిల్ నెలలో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వర్మ తెలియజేస్తూ కొది రోజుల క్రితం ఒక పోస్టర్ ను విడుదల చేశారు.. ఆ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేది ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం యూనిట్ సభ్యులు మాత్రం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.. ఈ ట్రైలర్ ను గమనిస్తే సిరీస్ మొత్తం పగ ప్రతీకారం తోనే నిండి ఉన్నట్లుగా కనిపిస్తోంది.
తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఒక కొడుకు కథ ఎలా ఉంటుందో అలా తీశాము అన్నట్టుగా తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ ను గమనిస్తే వర్మ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమానే పోలి ఉన్నట్లు గా కనిపిస్తోంది. వర్మ మరొకసారి పరిటాల రవి కుటుంబ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు అన్న అనుమానం కూడా కలుగుతోంది. అయితే ఈ విషయాన్ని వర్మ కానీ చిత్ర యూనిట్ కానీ ఎక్కడ తెలియజేయలేదు. అయితే ఈ వెబ్ సిరీస్ కాగా కేవలం కల్పితం లేదంటే మీ జీవితం ఆధారంగా తెరకెక్కించే ఏదైనా వెబ్ సిరీస్ అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: