పిల్లలు కనే ఆస్కారం లేదు.. కానీ అలా కానిచ్చేస్తున్నారు..!

NAGARJUNA NAKKA
అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కి వచ్చిన శృంగార తార సన్నీ లియోన్‌, డానియల్ వెబర్ దంపతులు పిల్లల కోసం చాలా ప్రయత్నించారు. అయితే సన్నీ లియోన్‌కి మూడుసార్లు గర్భధారణ కోల్పోయింది. దీంతో  ఆప్యాయంగా అమ్మా.. అని పిలిపించుకోవడానికి ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పిల్లలు కనాలనే ఆరాటంతో సరోగసీని ఆశ్రయించక తప్పలేదు. సరోగసీ విధానంలో కవలలకు తల్లిదండ్రులయ్యారు సన్నీలియోన్, డానియల్.
ఇక సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా ఆలస్యంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 40 సంవత్సరాల వయసులోకి అడుగు పెట్టాక అమెరికన్‌ ఆర్ధిక విశ్లేషకుడు జీన్ గుడ్‌ఎనఫ్‌ని పెళ్లి చేసుకుంది. అయితే ఫార్టీస్‌లో సహజ పద్ధతిలో పిల్లలని కనడం కొంచెం కష్టమని సరోగసీకి వెళ్లింది ప్రీతిజింటా. ఈ సరోగసీలో కవలలకు తల్లి అయ్యింది ప్రీతి. ఇక శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా దంపతులు ఇద్దరు పిల్లలు ఉండాలని కలలు కన్నారు. మొదట కొడుకు పుట్టాక మరో బేబి కోసం ప్రయత్నించారు. అయితే శిల్పాశెట్టి అనారోగ్య సమస్యలతో రెండు సార్లు మిస్‌కారేజ్ అయింది. దీంతో రెండో బేబీ కోసం సరోగసీని ఆశ్రయించారు. ఈ పద్దతిలో శిల్పా, రాజ్‌కుంద్రాకి కూతురు పుట్టింది.
బ్యాచిలర్‌ లైఫ్‌ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. పెళ్లి అంటే బరువు, బాధ్యతలు ఉంటాయని చెప్తారు. అయితే కొంతమంది సెలబ్రిటీస్‌ పెళ్లి తర్వాత ఉండే బాధ్యతలు మోయడానికి సిద్ధం గానీ, పెళ్లి మాత్రం వద్దంటున్నారు. జీవిత భాగస్వామి లేకుండా కుటుంబం కావాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లు పిల్లలకోసం సరోగసీకి వెళ్తున్నారు.
కరణ్‌ జోహార్‌ బోల్డన్ని లవ్‌స్టోరీస్‌ దర్శకత్వం వహించాడు. ఇప్పటికీ పెళ్లి కథలని నిర్మిస్తున్నారు. అయితే రొమాంటిక్ స్టోరీస్‌తో భారీగా లాభాలు అందుకున్న ఈ ఫిల్మ్‌ మేకర్ పెళ్లికి దూరంగా ఉన్నాడు. కానీ ఫ్యామిలీ లైఫ్‌ మాత్రం మొదలు పెట్టాడు. సరోగసీ ద్వారా పెళ్లి కాకుండానే కవల పిల్లలు రూహీ జోహార్, యశ్‌ జోహార్‌కి తండ్రి అయ్యాడు కరణ్.
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కూడా పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యింది. సరోగసీ పద్దతిలో ఒక పిల్లాడికి అమ్మ అయ్యింది ఏక్తా. ఇక ఈ నిర్మాత తమ్ముడు తుషార్ కపూర్ కూడా బ్యాచిలర్‌గానే తండ్రి అయ్యాడు. సరోగసి పద్దతిలో ఒక కూతురికి తండ్రి అయ్యాడు తుషార్.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: