టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నిఖిల్ సిద్ధార్థ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో హ్యాపీ డేస్ మూవీ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు, ఆ సినిమా తర్వాత ఈ హీరో కు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ సరైన విజయం మాత్రం నిఖిల్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. అయితే అలాంటి సందర్భం లోనే ఈ హీరో నటించిన స్వామి రారా సినిమా మంచి విజయాన్ని అందుకుంది, డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన స్వామి రారా సినిమా మంచి విజయం సాధించడంతో నిఖిల్ సిద్ధార్థ్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెరిగింది, స్వామి రారా మూవీ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు, ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించాడు.
ఈ తర్వాత నిఖిల్ హీరోగా నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరో గా కొనసాగుతున్నాడు, ఇది ఇలా ఉంటే డిఫరెంట్ కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నిఖిల్ సిద్ధార్థ్ 'కార్తికేయ' సినిమాతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. అయితే కార్తికేయ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ టు సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, కార్తికేయ టు మూవీ కి కూడా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల .. అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు, ఇటీవలే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్ లో చిత్రీకరించారు. అలాగే స్పెయిన్ .. పోర్చుగల్ లోని లొకేషన్స్ లో షూట్ చేస్తూ వస్తున్నారు, త్వరలోనే ఈ మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను వదలనున్నట్టు చెబుతూ, ఒక ఫోటోను షేర్ చేశారు, కార్తికేయ రెండు సినిమాలు నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.