ఐకాన్ స్టార్ ఫ్యామిలీ టూర్.. వైరల్ అవుతున్న పిక్స్..!!

murali krishna
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అలాగే బన్నీ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటీవలే పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

అంతేకాకుండా పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. అయితే పుష్ప పార్ట్ 1 సినిమా కోసం ఎంతో కష్టపడ్డ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం సిద్ధమవుతున్నాడని అందరికి తెలుసు.. ఈ క్రమంలోనే కాస్త విరామ సమయం దొరకడంతో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడట. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి మనందరికీ తెలిసిందే కదా.

స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో అయితే ఎంతో యాక్టివ్ గా ఉంటూ పిల్లలకు మరియు అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మార్చి 6,2011 న అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.తాజాగా మార్చి ఆరవ తేదీ కి వీరి పెళ్లి జరిగి 11 ఏళ్లు పూర్తి అయ్యిందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ దంపతులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారట.ఈ దంపతులకు అభిమానులు పలువురు సెలబ్రిటీలు పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఈ జంట యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఏదో అటవీ ప్రాంతానికి వెళ్లినట్టు సమాచారం.. అక్కడ వీరు చేసే సందడి అయితే మాములుగా లేదు. పిల్లలు జంతువులని చూసి ఆనందపడుతున్నారు. అల్లు అర్జున్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు.అంతేకాకుండా తన కుటుంబానికి అల్లు అర్జున్ ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన పిల్లల అల్లరి కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అల్లు అర్హ చేసే అల్లరి కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. స్నేహా రెడ్డి కి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: