నెట్టింట్లో వైరల్ అవుతున్న యాంకర్ శ్యామల పోస్టు..!!

N.ANJI
బుల్లితెర యాంకర్ శ్యామల గత కొద్దిరోజుల నుంచి ఈమె పేరు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇటీవల రాంగోపాల్ వర్మ తన గురించి ఒక ఈవెంట్‌లో మాట్లాడటం వల్ల అప్పటి నుంచి ఆమె తెగ వైరల్ అవుతోంది. దాంతో ఒక్కసారిగా యాంకర్ శ్యామల ట్రెండీగా మారింది. వర్మ శ్యామల గురించి.. ఇక ఇంత అందంగా ఉన్నావ్.. ఇన్నాళ్లు నాకు కనబడకుండా ఎక్కడ ఉన్నావ్ అంటూ స్టేజీ మీద శ్యామలతో పులిహోర కలిపారు. ఆయన మాటలకు శ్యామల సిగ్గు పడింది. దీంతో ఆర్జీవీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా యాంకర్ శ్యామల తన అభిమానులతో సోషల్ మీడియాలో మాట్లాడింది. ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో పెట్టిన ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్‌లో రకరకాలుగా ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఒక్కటి.. మీ ఫ్యాన్స్ అంటూ హాయ్ చెప్పమని కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు వచ్చాయి. కానీ ఎన్నిసార్లు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడం లేదంటూ మరి కొంత మంది అభిమానులు హర్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. అంతేకాక మరికొంత మంది తన మొబైల్‌లోని పర్సనల్ విషయాల గురించి అడిగినట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా వాట్సప్ డిపి, వాల్‌ పేపర్ వంటివి అడిగినట్లు తెలుస్తోంది.
కానీ ఆమెకి వచ్చిన ప్రశ్నలలో ఒక నెటిజన్ కొషన్ వచ్చింది. ఓ నెటిజన్ వెరైటీగా రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పమని అడిగాడు.. వర్మ గురించి ఏదైనా చెప్పండి అని అడగడంతో యాంకర్ శ్యామల స్పందించింది. ఆ ప్రశ్నకు నో కామెంట్.. కానీ ఆయన ఒక గొప్ప దర్శకుడు.. ఒకప్పుడు వర్మ చిత్రాలకు నేను కూడా పెద్ద అభిమానిని అంటూ యాంకర్ శ్యామల చెప్పుకొచ్చింది. అంతేకాదు.. వర్మ తీస్తున్న ప్రస్తుత చిత్రాల మీద యాంకర్ శ్యామల పరోక్షంగా కౌంటర్లు వేసినట్టుగా ఉందంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: