ప్రస్తుతం 'ఓ టి టి' కల్చర్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మన అందరికీ తెలిసిందే, ఒకప్పుడు సినిమా విడుదల అయిన తర్వాత చాలా రోజులకు సినిమాలు 'ఓ టి టి' లలో స్ట్రీమింగ్ అయ్యేవి, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చాలా వరకు తగ్గాయి, కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల చేయలేని పరిస్థితుల కారణంగా నేరుగా 'ఓ టి టి' లలో విడుదల అవుతూ ఉంటే, మరి కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల అయినప్పటికీ అతి తక్కువ రోజుల్లోనే ఏదో ఒక 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతున్నాయి, ఇది ఇలా ఉంటే థియేటర్ లలో విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్న సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు అతి తక్కువ కాలంలోనే ఏదో ఒక 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి, కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సందర్భంలో కూడా అతి తక్కువ కాలంలోనే ఏదో ఒక 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన 'ఎఫ్ఐఆర్' సినిమా ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 11 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది, 'ఎఫ్ఐఆర్' సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకే రోజు విడుదల అయ్యింది, ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇలా థియేటర్ వద్ద పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా ఈనెల 11 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది, మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ని విష్ణు విశాల్ స్వీయ నిర్మాణం లో తెరకెక్కించారు, తెలుగు లో ఈ మూవీ ని రవితేజ సమర్పణలో అభిషేక్ నామా విడుదల చేశారు.