పెళ్లి చేసుకోబోతున్న అఖిల్.. అమ్మాయి కూడా ఫిక్స్?

praveen
అక్కినేని అఖిల్.. అక్కినేని అనే భారీ బ్రాండ్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల ఆదరణ కరువు అవడంతో సక్సెస్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు..  ఎన్నో సినిమాలు చేసిన సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. చివరికి మొన్నటికి మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకుని ట్రాక్ లోకి వచ్చాడు అని అనిపించుకున్నాడు అఖిల్. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే అఖిల్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అఖిల్ పెళ్లి కాస్త క్యాన్సల్ అయిపోయింది. ఇలా అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అవ్వటం కూడా అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న అఖిల్ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. పెద్ద కొడుకు నాగచైతన్య ఇప్పటికే సమంతతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉంటున్నాడు. ఇలా ఇద్దరు కొడుకులు కూడా సింగిల్ గా తిరుగుతుండడంతో నాగార్జున తెగ బాధపడిపోతున్నాడట. ఇక మొదట నాగచైతన్య పెళ్లి చేయాలని అనుకున్నా విడాకులు అధికారికంగా రాకపోవడంతో ఆ ఆలోచన చేయడం లేదట.

 ఇక ఈ గ్యాప్ లో చిన్నోడు అఖిల్ పెళ్లి చేయాలని అనుకుంటున్నాడట కింగ్ నాగార్జున. ఇక రాజకీయ బ్యాక్ గ్రౌండ్ సినీ బ్యాక్ గ్రౌండ్ లేని అమ్మాయినీ కోడలని చేసుకోబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది.  ఇప్పటికే ఒక అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశాడని ఆ అమ్మాయి ఎవరు అన్న విషయాన్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని వారి కొత్త కోడలు పిల్ల గురించి తెలుసుకునేందుకు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలా అఖిల్ పెళ్లి గురించి టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: