సోను సూద్.. నువ్వు ఎంత గొప్ప వాడవయ్యా?

praveen
కరోనా వైరస్ ముందు వరకు సోను సూద్ అంటే సినిమాల్లో నటించే ఒక విలన్ గానే ఎంతో మందికి తెలుసు. విలన్ పాత్రలో నటిస్తూ క్రూరంగా కనిపిస్తూ ఉండే సోనూసూద్ ని చూసి అందరూ భయపడేవారు. కొంతమంది తిట్టుకునేవారు కూడా. మనుషులు ఇలా మాత్రం ఉండకూడదు అని అనుకునే వారు. కానీ కరోనా వైరస్ తర్వాత అందరూ విలన్ అనుకుంటూ భయపడుతున్న వ్యక్తి  మనసు వెన్న అన్న విషయం అందరికీ తెలిసింది. అతను విలన్ కాదు ఒక సూపర్ హీరో అన్నది అందరికీ అర్థమైంది.

 కరోనా వైరస్ సమయంలో ఎంతో మందికి సహాయం చేస్తూ హెల్పింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడూ సోను సూద్. తన సహాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడూ. ఎంతో మంది పేదలకు ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నాడూ. ఇలా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరో గా మారిపోయారు సోను. ఎంతోమంది పేద ప్రజలకు ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మరోమారు ప్రాణాలు కాపాడి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఇటీవలే పంజాబ్లోని మోగా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన 19 ఏళ్ల బాలుడు ప్రాణాలను సోనుసూద్ రక్షించాడు.

 ఫ్లై ఓవర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరగ్గా.. అటువైపుగా వెళుతున్న సోను ప్రమాదం జరగడాన్ని గమనించాడు. వెంటనే కారు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. ఇక ప్రమాదానికి గురైన కారులో అపస్మారక స్థితిలో 19 ఏళ్ల యువకుడు ఉండటాన్ని గమనించాడు. దీంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించాడూ. సకాలంలో వైద్యం అందించడం కారణంగానే సదరు యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు అనే చెప్పాలి. ప్రస్తుతం గాయాల నుంచి సదరు యువకుడు కోరుకుంటున్నాడట. ఈ విషయం ఇటీవల బయటకి రావడంతో సోనూసూద్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: