బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ లాంచింగ్ డేట్ ఫిక్స్ .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో మొత్తం చేసిన సినిమాలు 26. అందులో ఎక్కువగా ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఇష్టపడే సినిమాల్లో త్రివిక్రమ్ తీసిన అతడు, ఖలేజా సినిమాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అతడు సినిమాలో త్రివిక్రమ్ టేకింగ్ కి సూపర్ స్టార్ మహేష్ అద్భుతమైన యాక్టింగ్ కి అందరి నుండి మంచి పేరు దక్కింది. ఆ సినిమా 2005లో రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అందుకుంది.
త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ పై నటుడు మురళి మోహన్ నిర్మించారు. అనంతరం 2010లో మరొక్కసారి సూపర్ స్టార్ తో త్రివిక్రమ్ తీసిన సినిమా ఖలేజా. సూపర్ స్టార్ మహేష్ లోని ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ ని ఈ మూవీ ద్వారా బయటకు తీసిన త్రివిక్రమ్, సినిమా పరంగా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే ఖలేజా మూవీలో మహేష్ బాబు ఫెంటాస్టిక్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, డైలాగ్స్ కి ముగ్ధులు కాని ఆడియన్స్ ఉండరు అనే చెప్పాలి.
ప్రస్తుతం టెలివిజన్ లో ఈ రెండు సినిమాలు ఎన్ని సార్లు ప్రసారం అయినప్పటికీ కూడా మంచి రేటింగ్స్ ని దక్కించుకుంటూ ఉండడం విశేషం. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, త్వరలో మరొక్కసారి ఈ ద్వయం కలిసి ముచ్చటగా మూడవ సినిమా చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ఎంతో భారీగా నిర్మితం కానున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల రాగా, లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ ప్రతిష్టాత్మక సినిమాని ఫిబ్రవరి 3న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు టాక్. హైదరాబాద్ లో పలువురు అతిథుల సమక్షంలో ఈ లాంచింగ్ వేడుక ఎంతో గ్రాండ్ లెవెల్లో జరుగనుందని సమాచారం. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మార్చిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగనున్నట్లు ఇన్నర్ వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: