బిగ్ బాస్ 6 లో రీ ఎంట్రీ ఇవ్వనున్న అరియానా..!

Satvika
తెలుగు లో టాప్ రియాలిటీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చే షో బిగ్ బాస్.. ఈ షో 100 రోజులు జరుగుతుంది. 16 మందిని ఒక ఇంట్లో ఉంచుతారూ.. వారిలో వారికి గొడవలు, ఒకరిపై మరొకరికి ప్రేమలు, రొమాన్స్ కొనాలను చూపిస్తారు. అవి యువతను ఎక్కువగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అలా టాప్ రేటింగ్ ను పొందిన షో గా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.అయితే ఈ షో లో ఒకసారి కనిపిస్తే చాలు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అలానే బయట ఆఫర్లు కూడా భారీగా వస్తున్నాయి.

ఒకసారి వచ్చిన వాళ్ళు కాకుండా షో షొకు కొత్త వాళ్ళను తీసుకొస్తున్నారు. కానీ సీజన్ 6 లో మాత్రం అరియనా రీ ఎంట్రీ ఇస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.సీజన్ ఫోర్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా అరియనా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన అరియనా.. బిగ్ బాస్ సందడి చేసింది.సోహెల్ తో ఎక్కువ గొడవలు పడుతూ టామ్ అండ్ జెర్రీ గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కెప్టెన్ గా అరియనా బిగ్ బాస్ హౌస్ లో ఆమె సోహైల్ కి ఇచ్చిన షాక్ లు అందరికి నచ్చింది.

విషయాన్నికొస్తే.. బిగ్ బాస్ 6 ఓటిటి లో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.హౌస్ లో ఈ సారి ఒక గంట మాత్రమే కాక 24 గంటలు చూపించడానికి రెడీ అవుతూ ఉండటంతో పాటు పాత మాజీ కంటెస్టెంట్ లు కూడా తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో అరియనా నీ మళ్లీ హౌస్ లోకి తీసుకు రావడానికి గేమ్ ఆడించడానికి సిద్దం అయ్యినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం పై నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: