పెళ్లి చేసుకోవడానికి మన హీరో ఎంత ఇచ్చాడో తెలుసా

D.V.Aravind Chowdary
భారతీయ సంస్కృతిలో సాధారణంగా వివాహాం జరిగితే  అమ్మాయి తల్లిదండ్రులు వరుడికి మరియు వారి కుటుంబానికి  కట్నం మరియు మొదలైన పెట్టి పోతాలు అనేవి సాధారణంగా జరిగే విషయం, కానీ ఈ మధ్య ప్రేమ పెళ్ళిళ్ళ పుణ్యమా అని కట్న కానుకుల ప్రసక్తి అనేది లేకుండా పోతుంది. అలాగే ఒక సరికొత్త నూతన పోకడ కూడా ఇటీవల కాలంలో వచ్చింది . అదేంటిది అంటే పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలే ఎదురు కట్నం అడుగుతున్నారు. ఎదురు కట్నం అనేది ప్రస్తుతం భారత దేశంలో బాగా ట్రేండింగ్ లో విషయం కానీ ఇదే పని రెండు దశాబ్దాల క్రితం ఇప్పటి ఒక పెద్ద సుపర్ స్టార్ చేశాడు.  తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ కుటుంబానికి పెద్ద మొత్తం లో ఎదురు కట్నం ఇవ్వడమే కాకుండా మరెన్నో అదిరిపోయే రీతిలో బహుమతులు ఇచ్చాడు. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరో తెలుసా ? అతను ప్రేమించి వివాహాం చేసుకున్న యువతి ఎవరో తెలుసా ? ఆమె ను చేసుకోవడానికి ఎంత ఇచ్చాడో తెలుసా ? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం క్రింద చూడండి.  

 
 

ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళ సినీ ప్రేక్షకులు ఆరాధ్యదైవం  అజిత్  కుమార్ కాగా, ఆయన ప్రేమించి వివాహం చేసుకున్న యువతి ప్రముఖ కథనాయకి షాలిని. భారత చలనచిత్ర పరిశ్రమలో వీరిద్దరు మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు. వీరిద్దరి వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి తెలుడుకోవడానికి ఇప్పటికి ప్రేక్షకులు అత్యంత ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.
 90 వ మొదట్లో సినీ కెరియర్ ప్రారంభించిన అజిత్ నటుడిగా తనను తాను కోలీవుడ్ లో  నిరూపించుకోవడానికి సుమారు దశాబ్దం పట్టింది. ఆ దశాబ్ద కాలంలోనే తన సినీ మరియు వ్యక్తిగత జీవితం లో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. వరుసగా రెండు సార్లు ప్రేమలో విఫలం కావడంతో పాటుగా , వ్యక్తిగత ఒత్తిడులు వంటివి ఎల్లప్పుడూ చుట్టుముట్టి ఉండేవి. ఇంక సినీ పరంగా కూడా 1997 నుండి 1999 వరకు చేసిన సినిమా ల్లో ఎక్కువగా పరాజయాలతో కెరీర్ సైతం ముగింపు దశకు చేరుకుంది. అజిత్ కెరీర్ అలా ఉండగా షాలిని కెరీర్ మాత్రం తార పథనా దూసుకుపోతోంది. బాల నటిగా మొదలు పెట్టిన షాలిని , తర్వాత కాలంలో హీరోయిన్ గా సైతం విజయ పథంలో దూసుకెళ్లింది. ఆరోజుల్లోనే ఆమెతో నటించేందుకు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ని అన్ని భాషల హీరోలు పోటీపడ్డారు కానీ ఆమె మాత్రం సెలెక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకొని నటించి మలయాళ , తమిళ  సినీ పరిశ్రమలో  అగ్రస్థాయి నటిగా అయ్యారు.వరుస సినీ పరాజయాలతో అజిత్  సతమతమవుతున్న సమయంలోనే షాలిని గురించి అరా తీయగా మంచి నటి అని తెలియడంతో తను  నటించబోయే అమర్కలం చిత్రంలో కథానాయికగా ఎంపిక చేయమని దర్శకుడు తో  చెప్పగా , దర్శకుడు వెంటనే ఆమెను సంప్రదింపులు జరపగా మొదట విముఖత చూపిన తర్వాత అజిత్ స్వయంగా మాట్లాడం ఆమె ఒప్పుకోవడం  జరిగిపోయింది. అమర్కలం చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో నే అజిత్ వాలి చిత్రం  విడుదలై ఘనవిజయం కావడంతో అజిత్ మంచి గుర్తింపు లభించింది. ఆ సమయంలో నే షాలిని వ్యక్తిత్వానికి ఆకర్షితుడై ఆమెకు ప్రపోజ్ చేయగా ఆమె మొదట ఆశ్చర్య పోయిన వెంటనే తెరుకొని ఎస్ చెప్పింది. 1999 సంవత్సరం అజిత్ నటించిన పలు చిత్రాలు విడుదలై ఘనవిజయాలను సొంతం చేసుకోవడంతో పాటుగా వారిద్దరూ నటించిన అమర్కలం సైతం 100 రోజులు ఆడింది. అజిత్ అగ్ర హీరోగా అందళం ఎక్కాడు.
 


షాలిని, అజిత్ ల ప్రేమ వ్యవహారం వారిద్దరి కుటుంబాలతో పాటుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆశ్చర్యం కలిగించింది. షాలిని అజిత్ వివాహానికి షాలిని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పగా వారిని ఒప్పించేందుకు అజిత్ స్వయంగా రంగంలోకి దిగి ఒప్పించాడమే కాకుండా ఏకంగా కోటి రూపాయలు ఎదురు కట్నం మరియు పలు రకాల బహుమతులు కూడా ఇచ్చాడని ఆరోజుల్లోనే పెద్ద హాట్ టాక్. 2000 లో వీరిద్దరి వివాహాం హిందూ, క్రిస్టియన్ మరియు ముస్లింలు సంప్రదయాల్లో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహా రిసెప్షన్ కు మాలీవుడ్ , కోలీవుడ్ సెలిబ్రిటీలతో పాటుగా నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ప్రతిపక్ష నేత జయలలిత లు సైతం హాజరయ్యారు.


 


వివాహాం తర్వాత షాలిని సినిమాలకు స్వస్తి పలికి ఇంటికి పరిమితం కాగా అజిత్ మాత్రం తర్వాత కాలంలో రజినీకాంత్ , కమల్ హసన్ లాగా అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. వీరి ప్రేమకు ప్రతిరూపాలుగా కుమార్తె అనుష్క, కుమారుడు అద్విక్ ఉన్నారు. ఏంతో మంది సెలిబ్రిటీ దంపతులకు వీరి వైవాహిక జీవితం ఆదర్శంగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: