పుష్ప తో దేవిశ్రీ కోరిక తీరిపోయిందిగా..!

murali krishna
అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బాలీవుడ్ లో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అక్కడ పాతిక కోట్లు వసూలు చేయడమే చాలా పెద్ద విషయం అనుకుంటూ ఉంటే ఏకంగా 90 కోట్ల వసూళ్లను దక్కించుకుందట పుష్ప.

మరో వారం రోజుల్లో 100 కోట్లు లేకపోయినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సినిమాలు విడుదల కావడం లేదట.. అందుకే పుష్ప సినిమా కు భారీగా వసూళ్లు నమోదవుతున్నాయని తెలుస్తుంది.. ఇదే సమయం లో పుష్ప సినిమా యొక్క పాటలు హిందీ ప్రేక్షకులను అయితే విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి హిందీ అభిమానులు ఫీల్ అవుతున్నారట. హిందీ లో పుష్ప సాంగ్స్ కి క్రేజ్ ఉన్న నేపథ్యంలో దేవి శ్రీ ప్రసాద్ ని హిందీ కి ఆహ్వానించేందుకు పలువురు నిర్మాతలు కూడా సిద్ధమవుతున్నారట.

బాలీవుడ్లో సినిమాలు చేసేందుకు గాను దేవి శ్రీ ప్రసాద్ ఆసక్తి గా లేనట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే బాలీవుడ్లో సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా పలువురు మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ కూడా చేస్తారు. రెండు మూడు పాటలను కలిపి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. అలా నలుగురైదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఒక సినిమా కు వర్క్ చేస్తారట . అది నాకు అస్సలు నచ్చదు. ఒక సినిమా కు వర్క్ చేస్తే మొత్తం నేనే చేయాలని ఆ సినిమా లోని అన్ని పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేనే చేయాలని అలా చేస్తే నేను బాలీవుడ్ సినిమా కు వర్క్ చేస్తానంటూ దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకోవడం జరిగిందట.. ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ బాలీవుడ్ నుంచి ఆయనకు ఒక ఆఫర్ వచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది. ఒక స్టార్ హీరో సినిమా కు గాను దేవిశ్రీప్రసాద్ సింగిల్ కార్డు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించేందుకు ఆఫర్ని దక్కించుకున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం లో అతి త్వరలో నే క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: