ఆ సినిమా షూటింగ్ లో చనిపోయేదాన్ని : మహేశ్వరి

praveen
సినిమావాళ్ళకి ఏంట్రా ముఖానికి రంగు వేసుకుని కోట్లకి కోట్లు సంపాదిస్తూ ఉంటారు అని అనుకుంటారు చాలా మంది. కానీ సినిమా రంగంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి అని చెబుతూ ఉంటారు సెలబ్రిటీలు. సినిమాల్లో నటించడం అంటే ప్రేక్షకులకు తెరమీద కనిపించినంత  సులభం కాదు అంటూ చెబుతూ ఉంటారు. అంతే కాదు షూటింగ్ సమయంలో కొన్ని కొన్ని సార్లు  జరిగిన ప్రమాదాలను గుర్తు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారూ. ఇటీవలే ఇలాంటి ఒక ప్రమాదాన్ని గుర్తు చేసుకుంది ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి. గులాబీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అని చెప్పాలి.. కొన్నాళ్ల పాటు తన హవా నడిపించింది ఈ అమ్మడు.

 తన మొదటి సినిమా గులాబీ తో సెన్సేషన్ విజయాన్ని అందుకున్న మహేశ్వరి.. యూత్ అందర్నీ కూడా తన హస్కీ వాయిస్ తో ఆకర్షించింది. అదే సమయంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక అప్పట్లో వడ్డే నవీన్ మహేశ్వరి జోడి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. ఈ క్రమంలోనే పెళ్లి లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మా బాలాజీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది అంటూ ఇటీవలే మహేశ్వరి చెప్పుకొచ్చింది.

 ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరి ఈ సందర్భంగా మా బాలాజీ అనే సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి చెప్పుకొచ్చింది. వడ్డే నవీన్ మహేశ్వరి ఇద్దరు కలిసి బైక్పై వెళ్తున్న సమయంలో షూటింగ్ తీస్తుండగా బైక్ స్కిడ్ అయ్యి ఏకంగా లోయలోకి వెళ్ళిపోయింది అంటూ చెప్పుకొచ్చింది మహేశ్వరి. ఆ సమయంలో ప్రాణాలు పోతాయి అనుకున్నామని కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ గలిగాము అంటూ తెలిపింది. ఈ సినిమా సమయంలో జరిగిన దుర్ఘటన కెరీర్లో ఒక బ్యాడ్ మెమరీ గా మిగిలిపోయింది అంటూ మహేశ్వరి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: