బాల‌కృష్ణ : ఎన్టీఆర్ జై.. ఎన్టీఆర్ జ‌య‌హో.. ఎన్టీఆర్ అమ‌ర్ హై..!

N ANJANEYULU
ప్ర‌తి సంవ‌త్స‌రం ఎన్టీఆర్ వ‌ర్థంతి, జ‌యంతి సంద‌ర్భంగా నంద‌మూరి కుటుంబ స‌భ్యులు ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నివాళుల‌ర్పిస్తుంటారు. ఈసారి కూడా బాల‌కృష్ణ నివాళుల‌ర్పించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నంద‌మూరి తార‌క‌రామారావు వ‌ర్థంతి పుర‌స్క‌రించుకొని ఎన్టీఆర్‌ఘాట్‌కు వ‌చ్చాము. సిని, రాజ‌కీయ రంగ‌ల్ల‌లో నాన్న గారి గురించి ప్ర‌త్యేక‌ముగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్ జై,  ఎన్టీఆర్ జ‌య‌హో, ఎన్టీఆర్ అమ‌ర్ ర‌హే.. అని పేర్కొన్నారు. ఆయ‌న సాధ‌న‌కు ఆయ‌న మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని వ్య‌క్తిత్వం ఎన్టీఆర్ ది బాల‌కృష్ణ పేర్కొన్నారు. మ‌నంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచిన తెలుగు జాతి ముద్దుబిడ్డ‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో అప్యాయ‌తంగా పిలుచుకునే అన్న‌గారు.. ఆయ‌న అభిమానం అనేది అనంతం.
ర‌ణ‌రంగ భీమా, జ‌గ‌దేక సార్వ‌భౌమ వంటి నంద‌మూరి తార‌క‌రామారావు మ‌హాప్ర‌స్థానం. అంద‌రి గుండెల్లో అండ‌గా ఉండి.. ఎప్పుడు నీకు అండ‌గా ఉంటాన‌ని చెప్పి.. తెలుగు జాతిలో పుట్ట‌డం ఎన్టీఆర్ అదృష్టం. తెలుగు జాతి ఉన్నంత వ‌ర‌కు ఆయ‌న పేద‌ల గుండెల్లో నిలిచిపోతారు. ఆయ‌న సినీ రంగంలో ఎన్నో పాత్ర‌ల‌ను చేసార‌ని, ఆ త‌రువాత పార్టీని పెట్టి పేద‌లకు ఎంతో మేలు చేసార‌ని గుర్తు చేసారు. పేద‌వాడికి కావాల్సిన క‌నీస అవ‌స‌రాల‌ను స‌మ‌కూర్చారని చెప్పారు.  ఎన్టీఆర్ సేవ‌ల‌ను కొనియాడారు.
మ‌హానుభావుడు నంద‌మూరి తార‌క‌రామారావు రాజ‌కీయంగా ఎంతో ల‌బ్ది చేకూర్చారు. స్థానికుల‌కు రామారావు ఎప్పుడో క‌ల్పించారు. 610 జీవోను ఎన్టీఆర్ ఏనాడో క‌ల్పించాడు అని.. ఇవాళ ఎన్టీఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా రామారావు అభిమాని ఆయ‌న పాట వినిపించాడు. దానికి బాబ్జీ సంగీతం స‌మ‌కూర్చారు. సౌమ్య పాడింది. ఈరోజు అభిమానులంద‌రి త‌రుపున  ఆపాట‌ను విడుద‌ల చేసిన‌ట్టు తెలిపారు బాల‌కృష్ణ‌. కొద్ది సేప‌ట్లోనే యూట్యూబ్‌లో విడుద‌ల‌వుతుంది ఈపాట అని వెల్ల‌డించారు. ఎన్టీఆర్ 26వ వ‌ర్థంతి సంద‌ర్భంగా  నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు నంద‌మూరి కుటుంబ స‌భ్యులైన రామ‌కృష్ణ‌, త‌దిత‌రులు ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నివాళుల‌ర్పించారు. ఎన్టీఆర్ మ‌న‌స్సు మ‌క‌రందం అని కొనియాడారు. మ‌రొక వైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కు క‌రోనా సోక‌డంతో ఎన్టీఆర్ వ‌ర్థంతికి హాజ‌రు కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: