వైరల్: చిక్కుల్లో ‘ఆర్ఆర్ఆర్’.. సినిమాను నిలిపివేయాలని కోర్టులో యువతి ఫిర్యాదు..!

N.ANJI

ఆర్ఆర్ఆర్ మూవీ మళ్లీ చిక్కుల్లో పడింది. ఇప్పటికే సినిమా వాయిదా పడటంతో.. అభిమానుల్లో కొంతమేర నిరాశ కనిపిస్తోంది. తాజాగా ఓ యువతి సినిమాను ఏకంగా బ్యాన్ చేయాలని కోర్టులో ఫిర్యాదు చేసింది. లెజండరీ డైరెక్టర్ రాజమౌళి, స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నాలుగేళ్ల శ్రమించి తీసిన సినిమా.. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. తాజాగా మరో సారి వాయిదా పడటంతో.. ఆ సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఏడాది 7వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర బృందం భారీగా ప్రయోషన్స్ చేసింది. స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని దేశంలోని ప్రముఖ నగరాల్లో ప్రమోషన్స్ కూడా నిర్వహించింది.


ప్రమోషన్స్ కోసం సినిమా యూనిట్ ఏకంగా రూ.40 కోట్ల ఖర్చు చేసింది. వాస్తవానికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాను కరోనా కాటేసింది. కరోనా కేసులతోపాటు.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికమైంది. ఇప్పటికే కరోనా వ్యాప్తికి కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమయ్యాయి. ఇలాంటి తరుణంలో సినిమాను రిలీజ్ చేసినా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో సినిమాను పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. దీంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగింది. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి రిలీజ్ అయ్యే వరకు సినిమా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి.  


తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై హైదరాబాద్‌లోని హైకోర్టులో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఏపీలోని పశ్చిమగోదావరి ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య కోర్టులో పిల్ దాఖలు చేసింది. అయితే సౌమ్య ఈ ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్, రామ్ చరణ్ చారిత్రక యోధులైన కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారనే విషయం తెలిసిందే. అయితే ఈ యోధుల పాత్రలను రాజమౌళి ఎంతో వక్రీకరించి చిత్రీకరించారని ఆమె పేర్కొంది. ఒరిజినల్ స్టోరీ కాకుండా.. కేవలం కల్పితాలతో కథను తీసుకుని చిత్రీకరించారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేసి.. సినిమాను నిలిపివేయాలని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: