విజయ్ దేవరకొండ హీరోయిన్ కి.. అబ్బాయిలంటే అంత పిచ్చా?

praveen
మొన్నటివరకు టాక్ షోలు అంటే కేవలం బుల్లితెరపై మాత్రమే కనిపించేవి. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఓటిటీలులో కూడా ఎన్నో టాక్ షోలో ప్రసారం అవుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే  ఎక్కువగా ఓటిటీలో ప్రసారమయ్యే కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఆహా ఓటీటీ వేదికగా ఇటీవల కాలంలో ఎన్నో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి అనే చెప్పాలి. ఒకవైపు బాలకృష్ణ లాంటి స్టార్ హీరో లు unstoppable  అనే కార్యక్రమంతో అదరగొడుతు ఉండగా.. మరో వైపు టాలీవుడ్ లో టాప్ యాంకర్ లుగా కొనసాగుతున్న ప్రదీప్ మాచిరాజు, శ్రీముఖి లాంటి వాళ్లు కూడా పలు షోలతో ఆహా ఓటిటీలో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఇప్పటికే తన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి ఆహా ఓటీటీ వేదికగా చెఫ్ మంత్ర అనే కార్యక్రమాన్ని చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక సినీ సెలబ్రిటీనీ గెస్ట్ గా పిలిచి వారితో వివిధ రకాల వంటలు చేయించి ప్రేక్షకులను అలరిస్తోంది. శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల చెఫ్ మంత్ర 8 వ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

 ఎంతో మంది ప్రేక్షకులను ఈ ప్రోమో ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే శ్రీముఖి చెఫ్ మంత్ర కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే శ్రీముఖి ప్రియాంక జవాల్కర్ ఎంతో సరదా సరదాగా ముచ్చటించారు. ఇద్దరు మాట్లాడుతున్న సమయంలో ఎవరైనా అబ్బాయిలు ఉంటే ఎంతో హాట్ గా ఉండేది అంటూ ప్రియాంక జవాల్కర్ చెబుతుంది. దీంతో శ్రీముఖి షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ప్రియాంక జవాల్కర్ స్నేహితురాలు మహాతల్లి  షో లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక్కడ మన ఇద్దరం లేకపోయినా పర్వాలేదు ప్రియాంక జవాల్కర్ కు అబ్బాయిలు ఉంటే సరిపోతుంది అంటూ చెబుతోంది మహాతల్లి. దీంతో ఏంటి ప్రియాంక నీకు అబ్బాయిలంటే అంత పిచ్చా అంత కరువు లో ఉన్నావా అంటూ శ్రీముఖి చెబుతూ షాక్ అవుతుంది. ఇక ప్రియాంక జవాల్కర్ అబ్బాయి ఉంటే బాగుండేది అని చెప్పడంతో ఇది చూసిన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: