ప్రేక్షక టాలీవుడ్: సీమ ఏడుస్తుంది ఇంద్రసేనుడు ఎక్కడ...?

VUYYURU SUBHASH
మెగాస్టార్ చిరంజీవి కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా జనాలు ఆయన ను నాలుగు దశాబ్దాలుగా తమ‌ భుజాలమీద ఎక్కించుకొని మెగాస్టార్ గా కిరీటం పెట్టి మరి మోస్తున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నందునే చిరంజీవి ఇప్పటికీ మెగాస్టార్ గా ఉండటంతో పాటు ఆ కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరు కాదు .. ఏకంగా 12 మంది హీరోలు ఈ రోజు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.

చిరంజీవి సినిమా వచ్చిందంటే ఉత్తరాంధ్ర - కోస్తా - ప్రకాశం - నెల్లూరు టు సీడెడ్ ఇలా ఏ ప్రాంతం అయినా కూడా ఆయ‌న సినిమాల‌కు తొలి రోజు తొలి షో నుంచే బ్రహ్మరథం పడుతూ ఉండేది. అలాంటి చిరంజీవి ఒకానొక టైంలో వరుస ఫ్లాప్ లతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2001లో నరసింహనాయుడు సినిమాకి పోటీగా వచ్చిన చిరంజీవి మృగరాజు డిజాస్ట‌ర్ అయింది. ఆ తర్వాత శ్రీ మంజునాథ , సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డాడీ సినిమాలు కూడా అంచనాలు అందుకోలేదు. అలాంటి టైంలో చిరంజీవి కెరీర్ అయిపోయిందని అందరూ భావించారు.

అయితే రాయలసీమ ఫ్యాక్షన్ కథాంశంతో బి గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి ఇంద్ర సినిమా చేశారు. ఆ సినిమా 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పటి నుంచి చిరంజీవికి రాయలసీమ లో అభిమానులు బలంగా పెరిగి పోయారు. మరి ఇప్పుడు అలాంటి రాయలసీమ జనాలు వరదలు వచ్చి విలవిల్లాడుతున్నారు. ఆకలి తో కేకలు వేస్తున్నారు. చిరంజీవి కనీసం వారిని పట్టించుకున్న పాపాన పోలేదు అన్న విమర్శలు వస్తున్నాయి.

ఇంద్రసేన సీమ‌ ఏడుస్తోంది... ఒక్కసారి ఇటు వైపు చూసి వారి బాధలు పట్టించుకోని మీ వంతుగా సహాయం చేస్తావని ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు. మరి చిరు వీరి ఆకలి కేకలు వినిపించు కుంటారో లేదో హైదరాబాదులోనే కూర్చుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: