రాత్రయితే నాకు అదే పని.. అసలు విషయం చెప్పేసిన బాలయ్య?

praveen
ప్రస్తుతం ఎక్కడ చూసినా నందమూరి బాలకృష్ణ పేరే వినిపిస్తోంది.. మొన్నటి వరకూ బాలకృష్ణ నటించిన సినిమాల గురించి ఎక్కువగా వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ఒకటే టాపిక్. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న unstoppable కార్యక్రమం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. బాలకృష్ణ ఏంటి హోస్టింగ్ చేయడమేంటి అనుకున్న వారు.. ఇక ఇప్పుడు బాలకృష్ణ వాక్చాతుర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు అనే చెప్పాలి. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న unstoppable కార్యక్రమం ప్రస్తుతం టాప్ రేటింగ్ సంపాదించుకుంటోంది. ఎంతో మందిని ఆకర్షిస్తోంది.

ఇక హోస్టింగ్ లో బాలకృష్ణ స్పీడ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి. గతవారం మంచు వారి ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి స్పెషల్ గెస్ట్ లుగా బాలకృష్ణ unstoppable కార్యక్రమానికి వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగి పోయింది అని చెప్పాలి. ఇప్పుడు రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రెండవ ఎపిసోడ్ నాచురల్ స్టార్ నానిస్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇక నానిని ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ స్పాంటేనియస్ పంచులతో అదరగొట్టాడు నందమూరి బాలకృష్ణ.

ఈ క్రమంలోనే తన లైఫ్ స్టైల్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.. రాత్రి అయ్యిందంటే చాలు రిలాక్సేషన్ కోసం నాన్నగారి సినిమాలు చూస్తూ ఇక మెన్షన్ హౌస్ తీసుకోవడమే అంటూ చెప్పేసాడు నందమూరి బాలకృష్ణ. మరి నువ్వు రిలాక్సేషన్ కోసం ఏం చేస్తావు అంటూ నాని ని  అడుగుతాడు.. నాకు బెస్ట్ రిలాక్సేషన్ సినిమాలు అంటూ నాని చెబుతాడు.. పులిహోర కబుర్లు చెప్పకు నిజం చెప్పు అంటూ బాలకృష్ణ పంచ్ వేస్తాడు. దీంతో నవ్వుకున్న నాని నిజంగానే సినిమాలు చూస్తూ ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటాను అంటూ చెబుతాడు. ఇక ఆ తర్వాత నానితో కొన్ని టాస్క్ లు  ఆడించడం కూడా చేస్తాడు బాలకృష్ణ. ఇలా ప్రోమో మొత్తం ఎంతో ఫన్నీ ఫన్నీ గా సాగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: