మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

Divya
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా అంటే ఎలాంటి హీరోయిన్ అయినా, హీరో అయిన ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఆయన సినిమాలో ఎటువంటి అవకాశం వచ్చినా నటిస్తే కచ్చితంగా ఆ నటనకు మంచి మార్కులు వస్తాయని ఉద్దేశంతోనే ఓకే చెబుతూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు స్టార్ డం తెచ్చిపెట్టాడు డైరెక్టర్ పూరి. రాజమౌళి కూడా పలుసార్లు పూరి జగన్నాథ్ సినిమాలంటే చాలా ఇష్టం అని తెలియజేశాడు.
పూరి జగన్నాథ్ తో కలిసి పనిచేసిన స్టార్ హీరోలు సైతం వారి వారి యాటిట్యూడ్ లను మార్చుకున్నారని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి తండ్రి అయితే ఏకంగా పూరి జగన్నాథ్ ఫోటోనే తన మొబైల్ లో వాల్ పేపర్ గా సెట్ చేసుకున్నాడు. పూరి జగన్నాథ్ తో పోల్చుకుంటే రాజమౌళి వేస్ట్ అని రాజమౌళి తండ్రి తెలిపాడు.
ఇక పూరి జగన్నాథ్ తీసేటువంటి సినిమాలు కానీ, మేకింగ్ స్టిల్స్ గాని, రైటింగ్ స్టైల్ కానీ అన్నీ తనకు నచ్చుతాయని తెలియజేశారు విజయేంద్ర ప్రసాద్. ఇక ముఖ్యంగా పూరి జగన్నాథ్ సినిమాలో నటించిన హీరోయిన్లకు కూడా అంతే క్రేజ్ రావడం విశేషం. పూరి జగన్నాథ్ దగ్గర ఒక మోడల్స్ బుక్ కూడా ఉన్నదట. అందులో దాదాపుగా 200 వరకు మోడల్ ఫొటోస్ ఉన్నాయట.
అలా పూరి జగన్నాథ్ తమ సినిమాలకు సంబంధించి ఈ అమ్మాయి సెట్ అవుతుందో చూసి వారికి ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. మరికొంతమంది నటులకు అయితే సినిమా అవకాశం వచ్చేసరికి 5,6 సంవత్సరాలైనా పడుతుందట. హీరోయిన్ ను చూపించడంలో ఏ డైరెక్టర్ సాటిరారని చెప్పుకోవచ్చు. అయితే వీటన్నింటికి భిన్నంగా ఒక హీరోయిన్ విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు పూరి జగన్నాథ్. ఆమె ఎవరో కాదు మెహబూబా సినిమా లో నటించిన నేహ శెట్టి సినీ ఇండస్ట్రీ నుండి కనుమరుగైంది. ఈమె ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి కొందరు అయితే ఈమె పట్టించుకోవడమే మానేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: